Alluarjun Pushpa dance video : స్టైలిష్ స్టార్ బన్నీ నటిస్తున్న పుష్ప సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తి చేసుకుంటుంది.. ప్రస్తుతం తెలంగాణలోని ఖమ్మం జిల్లాలోని మోతుగూడెం లో చిత్రీకరణ జరుగుతోంది.. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన డాన్స్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. ఈ వీడియోలో డాన్స్ కంపోజిషన్ కళ్లకు కట్టినట్టుగా కనిపిస్తోంది.. ఈ సినిమాలో అల్లు అర్జున్ మాస్ స్టెప్స్ వేసి ప్రేక్షకులను అలరించనున్నారు..
మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పుష్ప సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న అల్లు అర్జున్ లారీ డ్రైవర్ రాజుగా ప్రేక్షకులను కనువిందు చేయనున్నాడు. బన్నీ సరసన రష్మిక మందన నటిస్తోంది. ఆర్య ఆర్య టు తర్వాత సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న హ్యాట్రిక్ చిత్రం పుష్ప. దేవిశ్రీ శ్రీ ప్రసాద్ స్వరాలు అందిస్తున్నారు . అలా వైకుంఠపురంలో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో పుష్ప సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే మేకర్స్ ఆగస్టు 13న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు తెలిపారు.