ముస్లిం పర్సనల్ లా బోర్డు ఏపీ చైర్మన్‌గా హజరత్ అల్తఫ్ అలీ రజా 

అమరావతి , డిసెంబరు 22 :  ముస్లిం సమాజంలో సిద్ధాంతాలను పర్యవేక్షిస్తూ, ముస్లింల జీవన విధానంలో సైద్ధాంతిక సూచనలు చేస్తూ ఉండే ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అంధ్రప్రదేశ్ విభాగాధిపతిగా కొండపల్లి హజరత్ సయ్యద్ షాబుఖారీ ఆస్థాన పీఠాధిపతులు , ఇస్లామిక్ పండితులు హజరత్ మొహమ్మద్ అల్తఫ్ అలీ రజా నియమితులయ్యారు. ఇస్లాం సమాజానికి అందించిన సేవలను గుర్తిస్తూ , దేశరాజధాని డిల్లీ లో ఉన్న ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లాబోర్డు నుంచి హజరత్ మొహమ్మద్ అల్తాఫ్ అలీ రజాకు నియామక ఉత్తర్వులందాయి.

డిసెంబర్ 25న కొండపల్లిలో జరగనున్న ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు మొదటి సమవేశంలో అయన పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పెద్ద సంఖ్యలో  ఇస్లామిక్ ఆధ్యాత్మిక గురువులు ఈ సమావేశానికి  పెద్దఎత్తున హాజరు కానున్నారు. ఈ సందర్బంగా హజరత్ మొహమ్మద్ అల్తాఫ్ అలీ రాజా మాట్లాడుతూ అంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తరువాత  అమరావతి రాజధాని ప్రాంతంలో తనతో పాటు ఆనేక మంది ఇస్లామిక్ ప్రముఖులు ఉన్నారని, వారిలో తనకు అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. తాను స్వచ్చందంగా  ముస్లిం సమాజ అభివృద్దికి , అభ్యున్నతికి కృషిచేస్తానన్నారు.