Sitting: ప్రస్తుత పని విధానంలో చాలా మార్పులు వచ్చాయి.. ఎక్కువసేపు కూర్చుని చేసే ఉద్యోగాలే ఎక్కువగా ఉన్నాయి.. ఎక్కువ సేపు కంప్యూటర్ ముందు కూర్చుని పని చేయడం, లేదంటే కూర్చుని పని చేయడం వలన ఆరోగ్యానికి హాని కలుగుతుంది.. గంటల తరబడి కుర్చీలో కూర్చోవడం వలన శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ప్రతికూల ప్రభావం ఉంటుందని తాజా అధ్యయనాలలో వెల్లడించారు.. ప్రతినిత్యం కదలకుండా గంటలతరబడి కూర్చోవడం వలన వ్యాయామం చేసిన ఎటువంటి ప్రయోజనం ఉండదట..!!
తాజాగా ఇంగ్లాండ్కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ హార్డర్స్ ఫిష్ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో గంటల తరబడి కూర్చోవడం వలన మానసిక ఆరోగ్యం పై కూడా ప్రభావం చూపుతుందని చెప్పారు. వారానికి రెండున్నర గంటలు వ్యాయామం చేసినా ఎటువంటి ప్రయోజనం ఉండదని వివరించారు.. దీని నుంచి బయటపడాలంటే వ్యాయామానికి మరింత ఎక్కువ సమయం కేటాయించాలని అన్నారు.
ఈ విషయంపై లియానే ఎజివేడో శాస్త్రవేత్త మూడు వందల మంది పై పరిశోధనలు చేసి వారిలో 50 శాతం మంది 8 గంటల కంటే ఎక్కువ సమయం కూర్చునే ఉంటున్నారని, వీరి మానసిక ఆరోగ్య పరిస్థితి సాధారణ ప్రతికూల ప్రభావం చూపిస్తుందని పేర్కొన్నారు. స్పోర్ట్స్ సైన్స్ ఫర్ హెల్త్ జర్నల్లో ఈ వివరాలను తెలిపారు.
పనిచేసే ఆఫీస్ లోనైన, ఇంట్లో అయినా అదే పనిగా కూర్చోకుండా మధ్యమధ్యలో లేచి నిలబడటం, నడవటం, అటు ఇటు తిరగడం వంటివి చేయాలి. ఇంట్లో మంచం, సోఫాలో కూర్చో కుండా నేల పైన కూర్చోవటం ఉత్తమం. ఆఫీస్ లో టీ,కాఫీ తెప్పించు కాకుండా లేచి వెళ్ళి మీరే తెచ్చుకోవటం మంచిది. వీలు దొరికినప్పుడల్లా నడవటం మంచిది.