Amala: నాగచైతన్య-సమంతల విడాకుల మీద అక్కినేని అమల స్పందన??

Share

Amala: నాగచైతన్య, సమంత విడాకుల ప్రకటన ప్రతి ఒక్కరిలోనూ బాధను కలిగిస్తోంది. నిజానికి అక్కినేని కుటుంబంలో విడాకులు తీసుకోవడం అనేది ఒక శాపంగా మారిందనే చెప్పుకోవాలి. నాగార్జున తన మొదటి భార్య లక్ష్మికి విడాకులు ఇవ్వడం.. నాగార్జున అల్లుడు సుమంత్ కీర్తి రెడ్డితో పెళ్లి బంధం తెంచుకోవడం మనం చూశాం. ఇక అఖిల్ అక్కినేని, శ్రియా భూపాల్ నిశ్చితార్థం పెళ్లిపీటలు వరకు వెళ్లకుండానే ఆగిపోయింది. ఇప్పుడు చైతన్య విషయంలోనూ అదే జరిగింది. అయితే వీరిద్దరి విడాకుల తర్వాత నాగార్జున బరువైన భావోద్వేగాలతో ఒక ట్వీట్ చేశారు. సమంత ఎప్పటికీ తమ కుటుంబానికి ఒక ప్రియమైన వ్యక్తిగానే ఉంటారని ఆయన స్పష్టం చేశారు.


Samantha- Naga Chaitanya: సమంతాతో విడాకులు అని ప్రకటించిన 24 గంటల తరువాత నాగచైతన్య ఆసక్తికర నిర్ణయం..!?

Amala: విడాకులపై అమల స్పందన

నాగార్జున సహధర్మచారిణి అక్కినేని అమల సైతం విడాకుల వ్యవహారం గురించి చాలా పాజిటివ్ గా స్పందించారు. నిజానికి సమంతతో అమలకు మంచి అనుబంధం ఉంది. చాలా సందర్భాల్లో సమంత పట్ల తనకున్న ప్రేమ ఆప్యాయతలను ఆమె వ్యక్తపరిచారు. తన ఇంటికి ఎంతో అందమైన, ప్రతిభావంతురాలైన సమంత కోడలిగా రావడం తమ అదృష్టమని ఆమె ఒక ఇంటర్వ్యూలో చాలా ఎమోషనల్ గా చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది. తన అత్తయ్య అన్నపూర్ణ తనని సొంత కూతురిలా చూసుకున్నారని.. అదేవిధంగా సమంతను ఒక అత్తయ్య గా ప్రేమగా చూసుకోవాలి అనుకుంటున్నానని ఆమె అప్పట్లో తెలిపారు. సమంతను వంటగదిలోకి కూడా రానివ్వని ఆమె చెప్పి ఆశ్చర్యపరిచారు.

Samantha- Naga Chaitanya: సమంతాతో విడాకులు అని ప్రకటించిన 24 గంటల తరువాత నాగచైతన్య ఆసక్తికర నిర్ణయం..!?

బాధగా ఉన్నా.. వారి నిర్ణయాన్ని గౌరవిస్తా:అమల

అయితే అమల అంత ప్రేమగా చూసుకున్న సమంత.. ఈరోజు అక్కినేని కుటుంబ బంధుత్వాన్ని వీడారు. దాంతో అమల చాలా బాధపడ్డారని తెలుస్తోంది. చైతూ, సమంతా బిడ్డలతో ఆడుకోవాలని అనుకున్న ఆమె కోరిక చివరికి కోరికలానే మిగిలిపోయింది. అయితే విడాకుల విషయం ఎంతో బాధిస్తున్నప్పటికీ.. చైతూ, సమంతలు తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నానని అమల అన్నట్లు సన్నిహిత వర్గాల సమాచారం. ఒక సొంత కూతురిలా దగ్గరైన సమంత ఇకపై తమతో కలిసి ఉండబోదనే చేదు నిజం అమలను కాస్త డిప్రెషన్‌కు గురి చేసినట్లు కూడా తెలుస్తోంది. అయినప్పటికీ నాగార్జున లాగానే ఆమె కూడా సానుకూలంగా స్పందించారు. కలిసి జీవిస్తూ బాధపడటం కంటే విడిపోయి హ్యాపీగా ఉండటమే ఉత్తమమనే నిజాన్ని ఆమె నెమ్మదిగా అంగీకరిస్తున్నట్లు తెలుస్తోంది.


Samantha- Naga Chaitanya : విడాకుల ప్రకటనకి సరిగ్గా నెల రోజుల ముందు జరిగింది ఇదే..!


Share

Related posts

రెమెడిసివిర్ టీకాను, నిరాకరించిన డబ్ల్యూ హెచ్ ఓ…! కారణాలు ఏంటి ..?

Vissu

జగన్ చేతిలో ఉన్న టీడీపీ లిస్ట్ ఇదేనా?

CMR

బ్రేకింగ్ : కోడిగుడ్డుపై ఈకలు పీకకండి – మంత్రి హరీష్ రావు

siddhu