NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Amaravathi Farmers: అమరావతి ప్రాంత రైతులు కీలక నిర్ణయం – సీఆర్డీఏ, ఏపి రెరాలకు నోటీసులు

Amaravathi Farmers: అమరావతి ప్రాంతంలో రాజధాని నిర్మాణానికి 30 వేల ఎకరాలకు పైగా భూములను రైతులు ప్రభుత్వానికి అప్పగించిన సంగతి తెలిసిందే. భూములను ఇచ్చిన సమయంలో ఏపీ సీఆర్డీఏతో రైతులు ఒప్పందాలు చేసుకున్నారు. ప్రభుత్వం భూములను అభివృద్ధి చేసి ప్లాట్ లు, కమర్షియల్ స్థలాలు రైతులకు తిరిగి అప్పగించే విధంగా నాడు ఒప్పందం జరిగింది. భూసమీకరణ (ల్యాండ్ పూలింగ్) ఒప్పందం ప్రకారం రైతులకు ప్లాట్లను మూడేళ్లలోగా అభివృద్ది చేయాలన్న నిబంధన ఉంది. అయితే ఇప్పటి వరకూ రైతులకు ప్లాట్ లను అభివృద్ధి చేసి ఇవ్వలేదు.

 

Amaravathi Farmers issued notice to ap crda
Amaravathi Farmers issued notice to ap crda

Read More: AP CRDA: హైకోర్టు తీర్పు నేపథ్యంలో సీఆర్డీఏలో కదలిక..అమరావతి రైతులకు లేఖలు

Amaravathi Farmers: పరిహారం చెల్లించాలి

అభివృద్ధి చేయకపోవడంతో తాము జీవనోపాధి కోల్పోయామని రైతులు పేర్కొంటూ ఎకరానికి రూ.3లక్షల వంతున పరిహారం చెల్లించాలని సీఆర్డీఏ, ఏపి రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అథారిటీ (రెరా)కు నోటీసులు ఇచ్చారు. రైతుల తరపున ఏపి రెరాకు హైకోర్టు న్యాయవాది ఇంద్రనీల్ ఈ మేరకు నోటీసులు ఇచ్చారు. సీఆర్డీఏ ప్రాజెక్టు ఎందుకు తీసుకోలేదని ఏపి రెరాకు లీగల్ నోటీసులు ఇచ్చారు. నిబంధనల ప్రకారం ప్లాట్లు ఇవ్వడంలో ఆలస్యం అయినందున రైతుల నివాస స్థలాలకు గజానికి నెలకు రూ.50లు, వాణిజ్య స్థలాలకు గజానికి రూ.75లు చొప్పున పరిహారం చెల్లించాలని ఈ నోటీసులో పేర్కొన్నారు.

 

ఈ నెలాఖరులోగా రాజధానికి భూములు ఇచ్చిన రైతులు సీఆర్డీఏ కార్యాలయంలో సంప్రదించి ప్లాట్ల రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని లేఖలు రాసిన తరుణంలోనే న్యాయవాది ద్వారా సీఆర్డీఏ, రెరాకు నోటీలు ఇవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీనిపై సీఆర్డీఏ ఏ విధంగా స్పందిస్తుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

Pawan Kalyan: రేపు పిఠాపురానికి పవన్ కళ్యాణ్.. తొలి విడత ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఇలా..

sharma somaraju

Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ పై తొలి సారి స్పందించిన సీఎం రేవంత్ ..చర్లపల్లిలో చిప్పకూడు తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలు

sharma somaraju

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!