మరో 16మంది రాజధాని రైతుల అరెస్టు

Share

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

అమరావతి:రాజధాని ఆందోళనలో పాల్గొన్న రైతుల అరెస్టులు కొనసాగుతున్నాయి. వెలగపూడి,మందడం, మల్కాపురం గ్రామాలకు చెందిన 16మంది రైతులను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. రాజధాని ఆందోళన అంశంపై మాట్లాడదామని  రైతులను చిలకలూరిపేట పోలీసులు పిలిపించారు. పోలీసు స్టేషన్‌కు వెళ్లిన రైతులను అరెస్టు చేశారు. కారుమంచి ఫణీంద్ర, కారుమంచి అప్పయ్య, జొన్నలగడ్డ మనోజ్, బొర్రా వరప్రసాద్, లోక్య భూక్యానాయక్, నాయుడు వెంకటేశ్వరరావు, త్రిపురనేని శ్రీను, కారుమంచి పకీరయ్య, నాయుడు రామకృష్ణ, బోడేపూడి నాగరాజులను చిలకలూరిపేట పోలీసులు అరెస్టు చేయగా మరో ఆరుగురు రైతులను తెనాలి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గత నెల 29వ తేదీ ఏడుగురు రైతులను, ఈ నెల నాల్గవ తేదీన ఒక రైతును అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

 

 


Share

Related posts

మాస్ ఇమేజ్ కోసం తెగ తాపత్రయ పడుతున్న నాగశౌర్య..!!

sekhar

జగన్ ఫ్లెక్సీలు తగలబెట్టిన సొంత పార్టీ కార్యకర్తలు..!!

sekhar

కరోనా‍ వ్యాప్తినే కాదు …రెండు హత్యలను కూడా ఆపిన లాక్డౌన్ !వర్కవుట్ కాని మట్కాకింగ్ సోదరుడి మర్డర్ ప్లాన్!

Yandamuri

Leave a Comment