ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ప్రారంభమైన అమరావతి రైతుల మహా పాదయాత్ర 2.0.. తొలి రోజు పాదయాత్ర ఇలా..

Share

అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోరుతూ ఆ ప్రాంత రైతులు చేపట్టిన ఉద్యమం నేటితో వెయ్యి రోజులకు చేరింది. ఈ నేపథ్యంలో అమరావతి నుండి అరసవెల్లికి రెండో విడత మహా పాదయాత్రకు రైతులు శ్రీకారం చుట్టారు. వెంకటాయపాలెం గ్రామంలో శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వామివారి రథాన్ని ముందుకు నడిపి పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. మాజీ మంత్రులు మాగంటి బాబు, కామినేని శ్రీనివాస్, సీపీఐ జాతీయ నేత నారాయణ కొద్దిసేపు రథం నడిపారు. మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తో పాటు పలువురు టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్, జనసేన, వామపక్షాల నేతలు, రైతులు పాదయాత్రకు మద్దతు తెలిపారు. పాదయాత్రలో వెంకటేశ్వరస్వామి రథం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Amaravati Farmers Maha Padayatra

ఏపి రాజధాని అమరావతిలో మరో కీలక ప్రతిపాదన చేసిన జగన్ సర్కార్

వెంకటాయపాలెం నుండి ప్రారంభమైన రైతుల మహా పాదయాత్ర .. శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి వరకూ దాదాపు వెయ్యి కిలో మీటర్ల మేర కొనసాగుతుంది. నవంబర్ 11న అరసవల్లిలోని సూర్యనారాయణుడి ఆలయంలో పూజా కార్యక్రమాల నిర్వహణతో పాదయాత్ర ముగుస్తుంది. రాజధాని పరిధిలోని 29 గ్రామాల రైేతులు, మహిళలు, రైతు కూలీలు విడతల వారీ గా పాదయాత్రలో పాల్గొననున్నారు. 60 రోజుల పాటు 12 పార్లమెంట్, 45 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా పాదయాత్ర కొనసాగనుంది. పాదయాత్ర తొలి రోజు కృష్ణాయపాలెెం, పెనుమాక, యర్రబాలెం మీదుగా 15 కిలో మీటర్లు సాగి మంగళగిరి చేరుకుంటుంది. రాత్రికి అక్కడే బస చేస్తారు. కాగా అమరావతి రైతుల మహా పాదయాత్రకు తొలుత ప్రభుత్వం అనుమతి తిరస్కరించిన నేపథ్యంలో హైకోర్టు అనుమతితో పాదయాత్రను ప్రారంభించారు.

అమరావతి రైతుల మహాపాదయాత్రకు పచ్చ జెండా ఊపిన హైకోర్టు.. పోలీసులపై కీలక వ్యాఖ్యలు


Share

Related posts

అల్లు అర్జున్ పుష్ప 5 భాషల్లో ఎందుకు వస్తుందో తెలుసా..?

GRK

Barley Tea: నిత్య యవ్వనంగా కనిపించాలంటే ప్రతిరోజు ఈ టీ తాగాల్సిందే..!!

bharani jella

Atchannaidu: జేసి ప్రభాకరరెడ్డికి అచ్చెన్న హెచ్చరిక..? ఎందుకంటే..?

somaraju sharma