NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

అమరావతి ఉద్యమం నాలుగు స్తంభలాట!! చంద్రబాబు × జగన్ × బీజేపీ × పవన్ = రైతులు

 

 

అమరావతి ఉద్యమం మొదలయ్యింది నేటికి సంవత్సరం… జగన్ ప్రభుత్వం రాగానే అత్యంత వివాదాస్పదం అయ్యింది రాజధాని తరలింపు వ్యవహారం. రాష్ట్రానికి శాసన రాజధానిగా అమరావతి ఉంటే పరిపాలనా రాజధానిగా విశాఖ ఉండాలని, న్యాయ రాజధానిగా కర్నూలు ఉండాలని జగన్ అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. దాని తర్వాత ప్రభుత్వం వడివడిగా రాజధాని మార్పు కు అడుగులు వేసినా, న్యాయపరమైన చిక్కులు వచ్చిపడ్డాయి. ఇదంతా తర్వాత గాని జగన్ ప్రకటన వెలువడిన వెంటనే రోడ్ ఎక్కింది గొంతు చించుకుంది మాత్రం రైతులే…

 

 

 

అమరావతి ఉద్యమం నేటికి 365 రోజులు పూర్తి చేసుకొని జనభేరి నిర్వహిస్తున్న తరుణంలో అసలు అమరావతి ఉద్యమం.. రైతుల గోషా ఎందుకు ఏమిటి ఇది రాజకీయ మలుపు ఎలా తీర్చుకుంది అనేది ఒకసారి పరిశీలిస్తే బాగుంటుంది…

** అమరావతి రాజధాని ఉద్యమాన్ని కేవలం 13 గ్రామాల కే పరిమితం చేసిన ఘనత కచ్చితంగా చంద్రబాబుది… ఉద్యమం మొదలు పెట్టగానే తమ సామాజిక వర్గం వారే ఉన్నారనే భావన కలిగించేలా చంద్రబాబు తీసుకున్న పలు వివాదాస్పద అంశాలు ఉద్యమాన్ని ప్రభావితం చేశాయి. ఉద్యమం మొదలు పెట్టగానే తిరుపతి వేదికగా జోలిపట్టి మరి చందాలు దండుకున్న చంద్రబాబు… తర్వాత ఉద్యమాన్ని అదే తీరున నడిపించే లేకపోయారు. తిరుపతి రాజమండ్రి తర్వాత అమరావతి ఉద్యమాన్ని ఆయన పట్టించుకోవడం మానేశారు.
** చంద్రబాబు అమరావతి ఉద్యమాన్ని పట్టించుకోకపోవడం వెనుక ఆయన సామాజిక వర్గం వారే ఉద్యమం చేస్తున్నారని పెద్దఎత్తున ప్రచారం జరగడం ప్రధాన కారణం. ఆయన సామాజిక వర్గం వారు అధికంగానే ఉన్నా సాధారణ రైతులు దళిత రైతులు సైతం ఉద్యమంలో పాల్గొంటున్నారు. అయితే కమ్మ సామాజిక వర్గం వారి డామినేషన్ తో ఉద్యమం స్వరూపం మొత్తం మారిపోయింది. వారే ఉద్యమం నడిపిస్తున్నారని ప్రొజెక్ట్ చేయడం లో వైసీపీ విజయం సాధించింది.
** అమరావతి ఉద్యమాన్ని రైతు ఉద్యమంగా రాష్ట్రమంతా తీసుకెళ్లాలని ఏ నాయకుడికి లేదు. పైగా అక్కడున్న కొందరు రైతులు డామినేషన్ అధికంగా ఉండడంతో వారే మొత్తం అయి నడిపిస్తున్నారు. ప్రభుత్వంతో చర్చలకు సైతం అక్కడ రైతులు మొగ్గు చూపడం లేదు.


** సీఆర్డీఏ పరిధి అంటే అమరావతి రీజియన్ పరిధిలో మొత్తం తొమ్మిది వందల వరకు గ్రామాలు ఉంటే, ఉద్యమాన్ని చేస్తున్న మాత్రం కేవలం 13 గ్రామాల ప్రజలు అనేది అంతటా ప్రోజెక్ట్ అయింది. ఇది తెలుగుదేశం నడిపిస్తున్న ఉద్యమంగా, చూపించడంలో వైసిపి పూర్తిగా విజయం సాధించింది.
** భూములు ఇచ్చిన రైతులు కు నిష్పత్తి ప్రాతిపదికన భూమి తీసుకుని దానిలో కొన్ని గజాల స్థలం ఇస్తూ, మిగిలిన దానిని అభివృద్ధి కి ఇవ్వాలని అప్పటి ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది అంతేకాదు వారి భూమిని అభివృద్ధి చేసేవరకూ కౌలు ఇస్తామని ఒప్పుకుంది. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కవులు నామమాత్రంగానే రైతులకు అందాయి. దీన్ని వెలికి తీయడం లో మీడియా అంతా శ్రద్ధ చూపలేదు.


** జగన్ అమరావతి మార్పు ప్రకటన చేయగానే భూముల ధరలు అమాంతం పడిపోయాయి. చంద్రబాబు హయాంలో విజయవాడ గుంటూరు హైవే పక్కన వెలిసిన అత్యంత పెద్ద భవనాలు, అపార్ట్మెంట్ల ధరలు కింద పడ్డాయి. ఇవన్నీ ఆయన అనుయాయులు ఆయన సామాజిక వర్గం వారు నిర్మించినవే. రాజధాని మార్పు ప్రకటన చేయగానే చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు ఆయన సామాజిక వర్గం వారి గుండెల్లో రైళ్లు పరిగెట్టాయి. దీనిని ఆపుకోవడం కోసమే రైతులతో ఉద్యమం మొదలు పెట్టారని ఆరోపణ బలంగా ఉంది.
** అమరావతి రైతులు తరఫున న్యాయపోరాటానికి ఇటు బిజెపి జనసేన సైతం ఇంప్లీడ్ అయ్యాయి. బిజెపి, జనసేన నాయకులు ఒక అడుగు ముందుకేసి ఖచ్చితంగా అమరావతి ఇక్కడే ఉంటుందని చెబుతున్నారు. ఎలా ఉంటుంది ఎందుకు ఉంటుంది అనే క్లారిటీ మాత్రం వారు రైతులకు ఇవ్వడం లేదు. దీంతో గందరగోళం నెలకొంది.
** అమరావతి విషయంలో బిజెపి మరో స్టాండ్. అమరావతి ని అక్కడే ఉంచాలని అయితే ఆఖరి బీజేపీకి రావాలనేది వారి ప్లాన్. ప్రస్తుతం అమరావతి ఉద్యమం రైతులు అంతా చంద్రబాబు చెప్పినట్లు నడుచుకుంటున్నారని, అయితే ఉద్యమాన్ని బీజేపీ తన ఆధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నించినా అది కుదరడంలేదు. అమరావతి పై ఇప్పుడు ఎలాంటి ప్రకటన చేసిన కేంద్రం నాయకులతో జగన్ కు మాట చెప్పినా అది పూర్తిగా టీడీపీ ఖాతాలోకి వెళ్తుంది. దీని బిజెపి అసలు ఒప్పుకోవడం లేదు.


** పవన్ కళ్యాణ్ ది అమరావతి ఉద్యమంలో చిన్న పాత్రే అయినా ఆయన మొదట అమరావతి రైతులకు సంఘీభావంగా చేసిన యాత్ర ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే దాన్ని పవన్ తర్వాత కొనసాగించలేకపోయారు. ఇటీవల మంగళగిరి కార్యాలయం లో రైతులతో మాట్లాడిన పవన్ కచ్చితంగా అమరావతిలోనే రాజధాని ఉంటుందని భరోసా ఇచ్చిన దానిలో ఆయన స్పష్టంగా చెప్పలేకపోయారు.
** అమరావతి ఉద్యమాన్ని రాష్ట్ర స్థాయిలో విస్తరింప చేయడంలో రాజకీయ పార్టీలు కావాలని వెనకడుగు వేశాయి. దీనిలో అన్ని పార్టీల భాగస్వామ్యం ఉంది. రాజధాని గ్రామాల రైతులు సైతం దీన్ని రాష్ట్రస్థాయి ఉద్యమంగా మలిచేందుకు కృషి చేయలేకపోయారు.. ఏదైనా ఉద్యమం ఒక ప్రాంతానికి పరిమితమై పోతే, దానిలోకి కులం ఆర్థిక వనరులు విషయంలో తేడాలు వస్తే అది పూర్తిగా నీరుకారిపోతుంది.. ఇప్పుడు అమరావతి ఉద్యమంలోకి కులం అనే సమస్య అతి ప్రధానమైంది. ఉద్యమం నీరుగారిపోయింది ఆనికి కులం రంగు పులుముకోవడమే ప్రధాన కారణం…..

author avatar
Comrade CHE

Related posts

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?