Ice Facial: ఐస్ ఫేషియల్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ముఖ్యంగా మనం చిన్న ఐస్ ముక్క రెండు నిమిషాలు పట్టుకొని చూడండి. రెండు నిమిషాలు కాదు కదా రెండు సెకండ్లు కూడా చేతిలో ఉంచుకోలేరు. ఎందుకంటే దాని చల్లదనం వల్ల చేతులు బిర్రుగా స్పర్శ లేకుండా అయిపోతాయి. మరి అలాంటిది ఐస్ ఫేషియల్ చేసుకుంటే పరిస్థితి ఏంటి? ఐస్ క్యూబ్ చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తుంది. ఇది రక్తం వేగంగా ప్రసరించేలా చేస్తుంది.. ఆవిరయ్యే నత్రజని చర్మాన్ని చల్లపరచడానికి ఉపయోగపడుతుంది. దీన్ని త్రయోథెరపీ చికిత్స అంటారు.

ఈ టెక్నిక్ ని జపాన్ లో 1978 లో రుమటాలజిస్ట్ డాక్టర్ తోషిమా యమగుచి అభివృద్ధి చేశారు. ఈ చికిత్స ప్రధానంగా రుమాటిక్ ఆర్థరైటిస్ చికిత్సకి క్రయోతెరఫీ అనేది నాన్ ఇన్వాసిస్ మెషిన్ ఆపరేటర్ ట్రీట్మెంట్ ముఖం లేదా శరీరంపై లిక్విడ్ నత్రజని పంప్ చేయడం జరుగుతుంది.ఇది కేవలం ఫేషియల్ కే కాకుండా మైగ్రేన్ నొప్పి, చర్మ వ్యాధుల చికిత్సకు కూడా ఉపయోగిస్తారు. చర్మాన్ని ప్రకాశవంతం చేయడానికి రంద్రాలు బిగించి పెదాలు మృదువుగా మార్చేందుకు సహాయపడుతుంది. కేవలం 15 నిమిషాల్లో ఫైన్ లైన్స్ లేదా వృద్ధాప్య సంకేతాలు తగ్గిస్తుంది.
ఐస్ ఫేషియల్ ప్రయోజనాలు:
ఐస్ ఫేషియల్ శరీరంలో ఇన్ఫ్లమేషన్ , మంటను తగ్గించడానికి ఐసింగ్ అవసరం. ఐస్ ఫేసింగ్ దెబ్బలు మరియు వాపులను తగ్గిస్తుంది. రోసెసియా, మొటిమలు తగ్గించడంలో కూడా భయపడుతుంది. ప్రకాశవంతమైన చర్మాన్ని ఇవ్వడానికి సహాయపడుతుంది. అదనపు శవం కారణంగా విస్తరించిన రంధ్రాల పరిమాణం తగ్గించేందుకు సహకరిస్తుంది.
అదేవిధంగా ఐస్ ఫేషియల్ వల్ల రంధ్రాలు తగ్గిపోయి మృదువైన చర్మం వస్తుంది. క్రయోథెరపీ మృత కణాలను ఎక్స్ ఫోలియేట్ చేయడంలో సాయపడుతుంది అంతేకాకుండా కొత్త కణాల పెరుగుదలకు ప్రోత్సహిస్తూ చర్మానికి రంగుని ఇస్తుంది. మైగ్రేన్, ఆర్థరైటిస్ నొప్పి లక్షణాలని తగ్గించడంలో సహాయపడుతుంది. మానసిక రుగ్మతలకు చికిత్స చేస్తూ క్యాన్సర్ కణాల పెరుగుదలని నిరోధిస్తూ. ఆల్జీమర్స్ వ్యాధి, డైమెన్షియా ప్రమాదాన్ని తగ్గించడంలో ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు నిరూపించారు..