ఈ-కామర్స్ సంస్థలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్లు తమ తమ సైట్లలో ప్రత్యేక సేల్స్‌ను నిర్వహిస్తున్నాయి. గురువారం ఈ సేల్స్ ప్రారంభమయ్యాయి. ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభమైన బిగ్ సేవింగ్ డేస్ సేల్ ఆగస్టు 10వ తేదీ వరకు కొనసాగుతుంది. అమెజాన్‌లో ప్రైమ్ డే సేల్ ఆగస్టు 7వ తేదీ వరకు ఉంటుంది. ఈ రెండు సేల్స్‌లోనూ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు ఇస్తున్నారు. ఇతర వస్తువులను కూడా ఈ సేల్స్‌లో తక్కువ ధరలకే కొనుగోలు చేయవచ్చు.
అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో ఐఫోన్ 11, గెలాక్సీ ఎస్10 ప్లస్, గెలాక్సీ ఎస్10, వన్‌ప్లస్ 7టి ప్రొ, ఐఫోన్ 8 ప్లస్, వివో వి19, రెడ్మీ కె20 ప్రొ, వివో వి17, గెలాక్సీ ఎం31 ఫోన్లను డిస్కౌంట్ ధరలకు ఇస్తున్నారు. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో.. ఐఫోన్ ఎక్స్ఆర్, ఐఫోన్ 7 ప్లస్, ఐఫోన్ 7, ఐఫోన్ ఎక్స్ఎస్, గెలాక్సీ ఎ31, గెలాక్సీ ఎ80, రెడ్మీ కె20 ప్రొ, రెడ్మీ కె20, రెడ్మీ 8, రియల్‌మి ఎక్స్2 ప్రొ, రియల్‌మి సి2, ఒప్పో రెనో 2ఎఫ్, రెనో 10ఎక్స్ జూమ్, రెనో 2, రెనో 2జడ్, వివో నెక్స్, ఎల్జీ వి30 ప్లస్ ఫోన్లను డిస్కౌంట్ ధరలకు కొనుగోలు చేయవచ్చు.
ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్ పీసీలు, స్మార్ట్ బ్యాండ్స్, స్మార్ట్‌వాచ్‌లు, టీవీలు, హెడ్ఫోన్లు తదితర ప్రొడక్ట్స్‌పై డిస్కౌంట్లను ఇస్తున్నారు. పలు బ్యాంకు కార్డుల ద్వారా వినియోగదారులు 10 శాతం అదనపు డిస్కౌంట్ పొందవచ్చు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?