అమెరికా, జనవరి 16: కొబ్బరి తీసిన తర్వాత చిప్పని విసిరి పారేయకండి….కాణీకి కూడా రాని చిప్ప నేడు వేల రూపాయలకు ఆన్లైన్లో అమ్ముతున్నారు. అమెజాన్‌లో ఖాళీ కొబ్బరి చిప్పలను 1,999కు విక్రయిస్తున్నారు. ఒక కొబ్బరి చిప్పను ఆఫర్‌పై 999రూపాయలకు అమ్ముతున్నారు.
ఊరికే దొరికే చిప్పకు అంత ధర ఏమిటని నెట్‌జన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఈ చిప్ప ఉత్పత్తి గురించి సంస్ధ ఇది నిజమైనది, సహజమైనది, కాస్త పగుళ్లు ఉండవచ్చంటూ వివరణ ఇచ్చింది.
దీంతో నెట్ జన్లు అమెజాన్‌పై మండిపడుతున్నారు. దేనికీ పనికిరాని చిప్పకు ఇంత ధరా అంటూ మండిపడుతున్నారు. ప్రధానంగా భారతీయులు కొబ్బరి చిప్పధరలను చూసి అవాక్కయారు.
కొబ్బరి తీసిన తర్వాత చిప్పలను వంట చెరుకు క్రింద గ్రామాల్లో వినియోగిస్తారు.
మార్కెట్లో ఒకొక్క ఎండు కొబ్బరి కాయ 20 రూపాయలకే లభ్యం అవుతోంది. దీంతో ఈవార్త వైరల్ అవుతోంది.
previous post
next post