Employment News: నిరుద్యోగులకు ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ గుడ్ న్యూ్స్ చెప్పింది. వర్క్ ఫ్రం హోం జాబ్స్ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. సెల్లర్ సపోర్ట్ అసోసియేట్‌కు సంబంధించిన ఉద్యోగాలకు అప్లై చేసుకునేందుకు చాన్స్ కల్పించింది. అయితే వీటిని అప్లై చేసుకునే వారు ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. మరిన్ని వివరాల కోసం https://www.amazon.jobs/en అనే వెబ్ సైట్ ను సందర్శించాలని సూచించింది. అయితే ఈ జాబ్స్‌కు అప్లై చేయడం, సెలక్ట్ చేసుకోవడం అన్నీ ఆన్ లైన్ లోనే చేపట్టనున్నారు. ఎంపికైన వారికి వర్క్ ఫ్రం హోం చాన్స్ కల్పిస్తారు.
సెల్లర్ సపోర్ట్ అసోసియేట్ పోస్టుల కోసం..
సెల్లర్ సోపోర్ట్ అసోసియేట్ పోస్టులకు ఎంపికైన వారికి ఏడాదికి రూ.2.75 లక్షల నుంచి 4 లక్షల వరకు వేతనం ఇస్తారు. ఇందుకు అప్లై చేసేందుకు డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. అప్లికేషన్ కోసం https://amazonvirtualhiring.hirepro.in/ అనే వెబ్ సైట్ ను సందర్శించాలి. ఇంగ్లీష్‌లో నైపుణ్యం, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వారికి ప్రియారిటీ ఇస్తారు. 24 గంటల్లో ఏ ఫిస్ట్ వేసినా పనిచేసేందుకు రెడీగా ఉండాలి. వర్క్ ఫ్రం హోం చేసుకునే వారే ఇంటర్ నెట్‌కు బాధ్యత వహించాలి. వారంలో 5 రోజులు మాత్రమే పని ఉంటుంది. హైదరాబాద్ సంస్థలకు ఎప్పుడు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి.
అప్లై చేయడం ఇలా..
ఫస్ట్ https://amazonvirtualhiring.hirepro.in వెబ్సైట్ లోకి వెళ్లి మీ వివరాలను సబ్ మిట్ చేయాలి. తర్వాత మీ మెయిల్ కు కన్ఫర్ మేషన్ మెసేజ్ వస్తుంది. తర్వాత సంస్థ వారు మీ అప్లికేషన్స్ ను వెరిఫై చేసి ఆన్ లైన్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. 2, 3 రౌండ్లలో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఇందులో ఇంగ్లీష్ సామర్థ్యంపై ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో అర్హత సాధించిన వారిని ఇంటర్వ్యూ కోసం ఆహ్వానిస్తారు. మరి మీరు సైతం అప్లై చేసుకోండి..