Amazon Prime Video: అమెజాన్ ప్రైమ్ లో సబ్ స్క్రిప్షన్ తీసుకోవాలంటే ముందుగానే త్వరపడండి. ఎందుకంటే డిసెంబర్ 13 వ తేది లోపు అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ తీసుకోకపోతే మీరు తర్వాత ఎక్కువ మొత్తంలో సబ్ స్క్రిప్షన్ చెల్లించాల్సి వస్తుంది. అమెజాన్ ప్రైమ్ డిసెంబర్ 13 వ తరువాత సబ్ స్క్రిప్షన్ చార్జీలు పెంచే ఆలోచనలో ఉంది. అంటే నెలవారీ, మూడు నెలల ప్లాన్, వన్ ఇయర్ సబ్ స్క్రిప్షన్ ధరలు కూడా పెంచే ఆలోచన చేస్తుంది అమెజాన్.
అతి తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్స్:
అమజాన్ ఇప్పటివరకూ తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లను అందిస్తున్న విషయం తెలిసిందే. ఎందుకంటే కేవలం రూ. 999 రూపాయలకే అమెజాన్ సబ్ స్క్రిప్షన్ వచ్చేస్తోంది. దీనితో పాటుగా అమెజాన్ లో సినిమాలు చూడడంతో పాటు, ఉచిత డెలివరీ సర్వీస్ సదుపాయాన్ని కూడా కల్పిస్తుంది. ఇప్పటివరకు మిగతా డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ అయిన నెట్ఫ్లిక్స్, ఫ్లిప్కార్ట్ వంటి సంస్థలు ఏవి కూడా అమెజాన్ మాదిరిగా కస్టమర్లకు ఇలాంటి సేవలను అందించట్లేదు. కానీ ఇప్పుడు ఈ నెల 13 తరువాత ప్లాన్ రేట్స్ ను 50% దాక పెంచాలనే నిర్ణయం తీసుకుంది.
పెరిగిన ప్లాన్ ధరలు ఎలా ఉన్నాయంటే :
ప్రస్తుతం అమెజాన్ లో నెలవారీ సబ్ స్క్రిప్షన్ రూ. 329కి బదులుగా రూ.459 అవుతోంది. అలాగే నెలవారీ అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ ధర రూ.129 కి బదులుగా 179 రూపాయలకు పెరిగింది. అలాగే ప్రస్తుతం ఉన్న అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ సంవత్సరానికి రూ.999గా ఉండగా అది ఇప్పుడు రూ.1499 కానుంది. అంటే 500 రూపాయలు ఎక్కువ అయిందన్నమాట. పెరిగిన ఈ కొత్త ధరలను అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ డిసెంబర్ 14వ తేదీ నుంచి అమలు చేయనుంది. అందుకనే ఒకవేళ మీరు మెంబెర్ షిప్ తీసుకోవాలని అనుకుంటే ఇప్పుడే త్వరపడండి. లేదంటే ఇప్పుడున్న ధరలకంటే 50% ఎక్కువ చెల్లించి ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవాలిసి ఉంటుంది.