దుబాయి, జనవరి 13: అంబటి రాయుడు బౌలింగ్ శైలి వివాదాస్పదంగా మారింది. టీం ఇండియా బ్యాట్స్ మెన్, పార్ట్ టైం బౌలర్‌గా ఉన్న అతను సిడ్నీ మైదానంలో శనివారం ఆసీస్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో రెండు ఓవర్లు వేసి 13 పరుగులు ఇచ్చాడు. అతని బౌలింగ్ అనుమానాస్పదంగా ఉందని మ్యాచ్ అనంతరం రిఫరీలు భారత జట్టు యాజమాన్యానికి నివేదికను అందించారు.
అంతర్ జాతీయ క్రికెట్ కౌన్సిల్ అనుమానాస్పద బౌలింగ్ యాక్షన్ నింబంధనల ప్రకారం అతడి బౌలింగ్‌ను 14 రోజుల్లోపు పరీక్షించ వచ్చు. ఈలోగా అతడు మిగిలిన మ్యాచ్‌లలో బౌలింగ్ చేయవచ్చని ఐసీసీ తెలిపింది.
ఇప్పటి వరకు రాయుడు 46 వన్డేల్లో 20.1 ఓవర్లు వేసి మూడు వికెట్లు తీశాడు. అతని ఎకానమీ రేటు 6.14గా ఉంది. సగటు 41.33. పరిమిత ఓవర్ల క్రికెట్ కోసం అతను ఫస్ట్ క్లాస్ క్రికెట్‌ను వదులుకున్నాడు.
previous post