Jr NTR: జూ.ఎన్టీఆర్ టీడీపీకి దగ్గర కానున్నాడా..? అర్థసందిగ్దతలో తమ్ముళ్లు..

Share

Chandrababu Naidu: 2 రోజుల క్రితం ఏపీ రాష్ట్ర అసెంబ్లీలో జరిగిన పరిణామాల తరువాత టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం పెట్టి వెక్కివెక్కి ఏడ్చారు. తన భార్య గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ.. ఆ అవమానాన్ని భరించలేకపోతున్నానని మీడియా ముందు కన్నీటిపర్యంతమయ్యారు. అయితే చంద్రబాబు ఏడ్చిన తరువాత వైకాపాపై టీడీపీ ఫాలోవర్ల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. వ్యక్తిగతంగా కుటుంబ సభ్యులను దూషించడం సరైంది కాదంటూ నారా వారి కుటుంబం కూడా కన్నెర్ర చేసింది. ఈ నేపథ్యంలో జూ.ఎన్టీఆర్(Junior NTR) సైతం ఒక సెల్ఫీ వీడియో విడుదల చేసి నారా వారి కుటుంబానికి మద్దతుగా వ్యాఖ్యానించారు. అయితే తారక్ నందమూరి కుటుంబానికి దగ్గరవుతున్నారా? టీడీపీ భవిష్యత్తు నాయకుడిగా చెప్పుకునే తారక్ తెదేపా రాజకీయాల్లో క్రియాశీలకంగా మారతారా? వీడియోలో చంద్రబాబు పేరు ప్రస్తావించకపోవడం వెనుకున్న కారణమేంటి? వంటి ప్రశ్నలు అందర్నీ సతమతం చేస్తున్నాయి.

చంద్రబాబుకు మద్దతుగా తారక్ వీడియో

చంద్రబాబు బోరున విలపించిన తర్వాత ఒక వీడియో విడుదల చేశారు తారక్. అనుచిత వ్యాఖ్యలకు గురైన ఒక కుటుంబీకుడిగా కాకుండా సాటి తెలుగువాడిగా మాట్లాడుతున్నానంటూ.. అరాచక సంస్కృతిని ఆపేయండి అంటూ కోరారు.

టీడీపీకి దగ్గర కానున్నారా

అయితే ఎన్నడూ లేని విధంగా జూనియర్ ఎన్టీఆర్ నందమూరి కుటుంబ సమస్యపై పెదవి విప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు. చాలా రోజులుగా ఎన్టీఆర్ నందమూరి, నారా వారి కుటుంబానికి దూరంగా ఉంటున్నారు. రాజకీయ పరిణామాలపై ఏ విధంగానూ స్పందించడం లేదు. తన సోదరి సుహాసిని 2018లో కూకట్‌పల్లి నుంచి పోటీ చేసినప్పుడు కూడా అతను రాజకీయంగా యాక్టివ్ కాలేదు. 2009 ఎలక్షన్ తర్వాత టీడీపీ ప్రచారంలో తారక్ చేరిన దాఖలాలు లేవు.

అయితే 2009 తర్వాత తొలిసారిగా టీడీపీ, చంద్రబాబు విషయంలో ఎన్టీఆర్ స్పందించి, స్పందించినట్లు స్పందించారు. దీనిపై కొందరు తెలుగు తమ్ముళ్లు హర్షం వ్యక్తం చేస్తుంటే మరికొందరి నుంచి మాత్రం విమర్శలు వస్తున్నాయి. సినిమాల్లో విలన్ల భరతం పట్టినట్లు తన కుటుంబ సభ్యులపై దూషణలు చేసిన పొలిటిషన్లను తారక్ ఎందుకు నిలదీయ లేకపోతున్నారని కొందరు బాహాటంగానే విమర్శిస్తున్నారు. సినిమాల్లో ఉగ్రావతారంలో డైలాగులు చెప్పే తారక్ నిజ జీవితంలో ఒక చెడు సంఘటన జరిగినప్పుడు ఎందుకు గళం ఎత్తలేకపోతున్నారని ప్రశ్నించిన వారూ లేకపోలేదు.

వీడియోలో చంద్రబాబు పేరు ప్రస్తావించకపోవడం వెనుకున్న కారణమేంటి?

తారక్ ఒక కామన్ మ్యాన్ గా స్పందించారే తప్ప కుటుంబ సభ్యుడిగా స్పందించలేదని పలువురు భూతద్దం పెట్టి మరీ చెబుతున్నారు. అయితే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే ఫిలిం కెరీర్ తో సహా కొడాలి నాని, వల్లభనేని వంశీలతో స్నేహబంధం చెడిపోతుందని ఎన్టీఆర్ ఆచితూచి మాట్లాడారని విశ్లేషకులు అంటున్నారు. ఎన్టీఆర్ కు పెళ్లి చేయడంలో చంద్రబాబు, భువనేశ్వరి చాలా హెల్ప్ చేశారు. దాంతో తారక్ తప్పనిసరి పరిస్థితులలో వారికి సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటున్నారు. అయితే తారక్ చేసిన వీడియోపై వైసీపీ సానుభూతిపరులు సానుకూలంగా స్పందిస్తుంటే టీడీపీ వారు మాత్రం ప్రతికూలంగా స్పందిస్తున్నారు. ఇదిలా ఉండగా తారక్ వ్యాఖ్యలు పూర్తిస్థాయిలో అర్థం చేసుకోలేక సగటు టీడీపీ ఫ్యాన్ అర్థసందిగ్దతలో ఉండిపోయాడు.

మరోపక్క గతంలో తారక్ ని ఒక అంటరాని వాడిగా నందమూరి కుటుంబం ట్రీట్ చేసిందని.. అందుకే వారితో అంటీ ముట్టనట్లుగానే ఎన్టీఆర్ వ్యవహరిస్తున్నారని వాదనలు వినిపించే వారూ లేకపోలేదు.


Share

Related posts

Bigg Boss 5 Telugu: కోపంతో రగిలిపోయిన ప్రియ ఆంటీ..సిరిని ఎంత మాట అన్నాదో చూడండి..!!

sekhar

డ్రాగన్‎పై నిఘా అలా పెట్టారా? 

sekhar

Bharat Bandh : ఏపిలో కొనసాగుతున్న బంద్..వామపక్షాల నిరసన ప్రదర్శనలు

somaraju sharma