న్యూస్ రాజ‌కీయాలు

అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఇవ్వబోయే తొలి స్పీచ్ వెనుక ఉన్న భారత సంతతి వ్యక్తి..!

Share

జో బైడెన్ అమెరికా 46వ అధ్యక్షుడిగా శ్వేత సౌధంలో మరికొద్ది గంటల్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎన్నో అనూహ్య పరిస్థితుల మధ్య ప్రమాణ స్వీకారం చేయనున్న బ్రిటన్ చాలా నిరాడంబరంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ఇక ఈ క్షణం కోసం ప్రపంచం అంతా ఎదురు చూస్తుంది. తన టీం లో 20 మంది భారతీయ మూలాలు ఉన్న వ్యక్తులకి బైడెన్ చోటు ఇవ్వడం కూడా కొత్తగా ఏర్పడే ప్రభుత్వం పై భారతీయుల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది.

 

అయితే ఈరోజు ప్రమాణస్వీకారం మహోత్సవంలో భారత సంతతికి చెందిన వ్యక్తి కీలకమైన పాత్ర పోషించనున్నాడు. తెలంగాణకు మూలాలు ఉన్న చొల్లేటి వినయ్ రెడ్డి కాబోయే అధ్యక్షుడు బైడెన్ కు స్పీచ్ రైటింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడుతున్న బైడెన్ ఏం ప్రసంగించాలి అన్నది ఇతనే నిర్ణయిస్తారు. దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

దేశ భవిష్యత్తును నిర్దేశించే ఈ స్పీచ్ ను వినయ్ రెడ్డి డ్రాఫ్ట్ చేయడం భారతీయుల్లో ఆనందం నెలకొంది. ఈ స్పీచ్ ను డ్రాఫ్ట్ చేసిన వినయ్ రెడ్డి మూలాలు తెలంగాణలోని కరీంనగర్ హుజూరాబాద్ మండలం పోతిరెడ్డి గ్రామంలో ఉన్నాయి. వృత్తిరీత్యా వినయ్ రెడ్డి తండ్రి నారాయణ రెడ్డి 1970లో కుటుంబంతో సహా అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు. అమెరికాలోని ఒహియా రాష్ట్రంలో పుట్టి పెరిగిన వినయ్ అక్కడే స్కూలింగ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. మియామీ యూనివర్సిటీలో న్యాయశాస్త్రంలో పట్టా పొందాడు. ఇక మొన్న జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో కూడా ప్రధాని, ఉప ప్రధాని లకి సీనియర్ అడ్వైజర్ గా స్పీచ్ రైటర్ గా పని చేశాడు వినయ్.


Share

Related posts

Vaishnavi Chaitanya : వైష్ణవి చైతన్య మిస్సమ్మ మూడో ఎపిసోడ్ వచ్చేసింది

Varun G

NIck Name: మీ గర్ల్ ఫ్రెండ్ ని బేబ్ అని పిలుస్తున్నారా?అయితే వెంటనే మానేయండి  ??

siddhu

భగవద్గీత శ్లోకాన్ని ట్వీట్ చేసిన హోంమంత్రి

somaraju sharma
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar