NewsOrbit
న్యూస్

అమెరికా అధ్యక్షుడు అయితే ఏంటటా..!? వేతనం, నివాసం విలువ తెలుసుకోండి..!!

 

 

మగవారి జీతం, ఆడవారి వయసు అడగకూడదు అనేది మన పేదవాళ్లు నమ్మే మాట. అయితే ప్రస్తుత పరిస్థులలో ఉద్యోగం చేస్తున్న వారిని మొదటగా మీ ప్యాకేజీ ఎంత, కట్టింగ్స్ అని తీసేస్తే మీకు చేతికి జీతం ఎంత వస్తుంది, అనే ప్రశ్నలు అడగడం మొదలు పెడతారు. జనరల్ గా ఎక్కువ జీతాలు ఇంజనీర్స్ కి, డాక్టర్స్ కి వాళ్ల వాళ్ల ఎక్స్పీరియన్స్ బట్టి ఉంటాయి. అయితే గత రెండు రోజుల నుండి ఎంతో ఉత్కంఠ మీద సాగిన అమెరికా ఎన్నికలు, డెమోక్రాటిక్ పార్టీ అధ్యక్షుడు జ్యో బైడెన్ గెలవడం తో ఉత్కంఠకి తెరపడింది. అయితే అధ్యక్షుడి గా ఎన్నిక అయినా వారికి జీతం ఎంత ఉంటది అనేది అందరి మైండ్ లో మెదిలే ప్రశ్ననే.

అధ్యక్షుని వేతనం:
దీనికి సమాధానం గా ఇప్పుడు మనం అసలు అమెరికా అధ్యక్షుడి వేతనం, అధ్యక్షా పదవిలో ఉన్న ప్రయోజనాలు, అధ్యక్షుని భద్రత గురించి తెలుసుకుందాం.ముందుగా జీతం విషయాన్ని కి వస్తే, అధ్యక్షుడి వేతనం నెలకు 400,000 మిలియన్ డాలర్లలు అంటే ఇండియన్ రూపాయలలో 2 కోట్ల 86 లక్షలు. దీనితో పాటు ప్రత్యేక నివాసం, వ్యక్తిగత విమానం, సురక్షితమైన కారు సౌకర్యాలు ఉంటాయి.

నివాస సౌకర్యాలు:
మొత్తం 55,000 చదరపు అడుగుల అంటే18 ఎకరాల విస్తీర్ణంలో ఉండే విలాసవంతమైన రాజప్రసాదంలో అమెరికా అధ్యక్షుడు నివాసం ఉంటారు. దీనినే వైట్ హౌస్ అంటారు. ఇందులో 132 గదులు, 35 బాత్‌రూమ్‌లు, 28 ఫైర్‌ప్లేస్‌లు, టెన్నిస్ కోర్ట్, ఫ్యామిలీ మూవీ థియేటర్, జాగింగ్ ట్రాక్, స్మిమింగ్ పూల్ ఉంటాయి. ఐదుగురు చీఫ్ చెఫ్‌లు, సోషల్ సెక్రెటరీ, చీఫ్ కాలీగ్రాఫర్, ఫ్లోరిస్ట్, వాలెట్స్, బట్లర్స్ ప్రత్యేకంగా విధులు నిర్వహిస్తారు. ఇంతే కాకుండా అధ్యక్షుడి అధికార గెస్ట్‌హౌస్. వైట్‌హౌస్ కంటే 70వేల చదరపు అడుగుల పెద్దది. ఇందులో అతిథులు, సిబ్బంది కోసం 20 బెడ్‌రూమ్‌లు సహా 139 గదులు, 25 బాత్‌రూమ్‌లు, నాలుగు డైనింగ్ హాల్స్, జిమ్, ఫ్లవర్ షాప్, హెయిర్ సెలూన్ ఉంటాయి. మ్యారీలాండ్‌లో 128 ఎకరాల విస్తీర్ణంలో ఉండే ఎస్టేట్‌ను 1935లో ఏర్పాటు చేశారు.

ప్రయాణ భద్రతలు:
అమెరికా అధ్యక్షుడి పర్యటన విషయాన్నికి వస్తే అత్యాధునిక విమానం ఎయిర్‌ఫోర్స్ ఒన్, మెరైన్ ఒన్, ఒకే రకమైన ఐదు హెలికాప్టర్లు ఉంటాయి. ఇంజిన్ విఫలమైనప్పటికీ ఇవి గంటకు 150 మైళ్ల పైగా రెస్క్యూ మిషన్లు, క్రూయిజ్లను ఆపరేట్ చేయగలదు. ఇది యాంటీ-క్షిపణి వ్యవస్థలు, బాలిస్టిక్ క్షిపణులను కలిగి ఉంటాయి. ప్రెసిడెంట్ కారు ‘లిమోసిన్’ ప్రపంచవ్యాప్తంగా సురక్షితమైన కారుగా గుర్తింపు పొందింది. రసాయన దాడి జరిగినప్పుడు ఎటువంటి ముప్పు లేకుండా తలుపులు ఆయుధ-పూతతో ఉంటాయి. దీని అద్దాలు ఐదు పొరల గాజు, పాలికార్బోనేట్‌తో ఉంటాయి. ఈ కారులో ఆక్సిజన్ సరఫరా, అగ్నిమాపక వ్యవస్థ, బ్లడ్ బ్యాంక్ కూడా ఉన్నాయి.

సీక్రెట్ సర్వీస్ సెక్యూరిటీ:
ఇంకా అధ్యక్షుడిని భద్రత విషయానికి వస్తే అధ్యక్షుడు, అతడి కుటుంబానికి 24 గంటల సెక్యూరిటీ ఉంటుంది. సీక్రెట్ సర్వీస్ నిరంతరాయం భద్రత కల్పిస్తుంది. పన్నుల సహిత వేతనం 4,00,000 డాలర్లు, వినోద అలవెన్సు 19,000 డాలర్లు, ఇతర అలవెన్సుల కింద అదనంగా ఏడాదికి 50,000 డాలర్లు, ట్రావెల్ అలవెన్సు 100,000 డాలర్లు చెల్లిస్తారు. అయితే అధ్యక్షా పదవిలో ఉన్నపుడే కాకుండా, పదవి కలం ముగిసాక కూడా ఫించన్, ఆరోగ్య భీమా, సీక్రెట్ సెక్యూరిటీ సర్వీస్ వంటి సేవలు అందచేస్తారు.

మాజీ అధ్యక్షుని ప్రయోజనాలు:
మొదట్లో మాజీ అధ్యక్షులకు ఎలాంటి ప్రయోజనాలు ఉండేవి కావు.1958లో ‘ఫార్మర్‌ ప్రెసిడెంట్‌ యాక్ట్‌’ అమల్లోకి వచ్చింది. ఈ యాక్ట్‌ ప్రకారం, మాజీ అధ్యక్షులకు ప్రభుత్వం పింఛను, సిబ్బంది జీతభత్యాల భృతి, ఆరోగ్య బీమాతోపాటు రహస్యంగా భద్రత కల్పిస్తుంది. మాజీ అధ్యక్షులకు సెక్రటరీ ఆఫ్‌ ట్రెజరీ పింఛను మంజూరు చేస్తుంది. ప్రస్తుతం ఏడాదికి 2,19,200డాలర్లు(దాదాపు రూ.1.6కోట్లు) పింఛను ఇస్తున్నారు. అధ్యక్ష పదవి నుంచి దిగిన వెంటనే పింఛను ఇవ్వడానికి జరగాల్సిన ప్రక్రియ మొదలవుతుంది. మాజీ అధ్యక్షుడి జీవిత భాగస్వామికి కూడా ఏడాదికి 20వేల డాలర్ల చొప్పున పింఛను ఇస్తారు. అయితే, మరే ఇతర చట్టబద్ధమైన పింఛన్లు వారు పొందతూ ఉండకూడదు. లేదా ఉన్న పింఛన్ను వదులుకుంటేనే ఈ 20వేల డాలర్లు చెల్లిస్తారు. ఇంతే కాకుండా శ్వేతసౌధం విడిచిపెట్టి వేలేటప్పుడు. మరో ప్రాంతంలో సొంతగా ఏదైనా ఆఫీస్‌ ఏర్పాటు చేసుకోవడానికి, అయ్యే ఖర్చుల తో పాటు, 7 నెలలు ఆఫీస్ లో ఉండే ఖర్చులని కూడా ప్రభుత్వమే భరిస్తుంది. మాజీ అధ్యక్షులకు వ్యక్తిగతంగా ఉండే ఉద్యోగస్తులకు కూడా ఇవ్వాల్సిన జీతాలను ప్రభుత్వం జనరల్‌ సర్వీస్‌ అడ్మినిస్ట్రేషన్‌ విభాగం ఇస్తుంది.

ఇంకా ఆరోగ్య భీమా ద్వారా దేశాధ్యక్షుడికే కాదు.మాజీ అధ్యక్షులకు కూడా మిలటరీ ఆస్పత్రుల్లోనే వైద్యం అందిస్తారు. కానీ, మెనేజ్‌మెంట్‌ అండ్‌ బడ్జెట్‌ విభాగం నిర్ణయించిన ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. రెండుసార్లు అధ్యక్ష పదవి చేపట్టిన నేతలు ఫెడరల్‌ ఎంప్లాయి హెల్త్‌ బెనిఫిట్స్‌ ప్రోగ్రాం కింద ఆరోగ్య బీమా తీసుకోవచ్చు. భద్రత విషయాన్నికి వస్తే, ప్రభుత్వం మాజీ అధ్యక్షులు, వారి కుటుంబానికి రహస్యంగా భద్రత కల్పిస్తోంది. 1965 నుంచి 1996 వరకు జీవితకాలం భద్రత కల్పించే చట్టం అమల్లో ఉండేది. 1997లో దానిని పదేళ్లకు కుదించారు. అయితే, బరాక్‌ ఒబామా దీనిని మళ్లీ జీవితకాలానికి పెంచుతూ చట్టం తీసుకొచ్చారు. ఒక్కసారి అగ్ర రాజ్యం అయినా అమెరికాకి అధ్యక్షుడు అయితే జీవితాంతం ప్రభుత్వం అందించే సేవలు అన్ని వినియోగించుకోవచ్చు అన్నమాట.

Related posts

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk