రెండో వారంలోకి ప్రవేశించిన షట్ డౌన్

Share

అమెరికా షట్ డౌన్ రెండో వారంలోకి ప్రవేశించింది. మెక్సికో సరిహద్దులో గోడ విషయంలో ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకిస్తున్న డెమొక్రట్లతో చర్చలు విఫలం కావడంతో అమెరికాలో ఆర్థిక స్తంభన వచ్చే బుధవారం వరకూ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ట్రంప్ సర్కార్ ప్రవేశ పెట్టిన ద్రవ్య వినిమయ బిల్లును డెమొక్రట్లు వ్యతిరేకించడంతో కాంగ్రెస్ ఆమోదం పొందలేదు.

మెక్సికో సరిహద్దులో గోడ నిర్మాణానికి ట్రంప్ 3500 కోట్ల రూపాయలు (500 కోట్ల డాలర్లు) కేటాయించాలని తీసుకున్న నిర్ణయాన్ని డెమొక్రట్లు ఆమోదించకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో డెమొక్రట్లతో నిన్న జరిపిన చర్యలు విఫలం కావడంతో అగ్రరాజ్యంలో ఆర్థిక స్తంభన వచ్చే బుధవారం వరకూ కొనసాగనుంది. ఎందుకంటే మళ్లీ బుధవారం మాత్రమే మళ్లీ బడ్జెట్ కేటాయింపులపై చర్చించేందుకు సెనేట్ సమావేశం కానుంది. ఇలా ఉండగా ఈ పరిస్థితికి డెమొక్రట్టే కారణమని వైట్ హౌస్ ప్రతినిథి విమర్శించారు. వారు అమెరికా ప్రజల రక్షణ కంటే అక్రమ వలసదారులను కాపాడేందుకే ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తున్నారని విమర్శించారు.


Share

Related posts

నమ్మలేని నిజం – ప్రభాస్ రేంజ్ చూసి రజనీకాంత్ కే కడుపు మంట పుట్టింది..?

arun kanna

జనసేనాని ఆంధ్రా కుమార స్వామి కానున్నారా?

Siva Prasad

అమ్మాయి న‌డిరోడ్డుపై నిల‌బ‌డి..క్షమాప‌ణ చెప్పాలంటున్న ప్ర‌దీప్ అభిమానులు

sridhar

Leave a Comment