తెలుగు యూనివ‌ర్స్ పోటీల్లో ‘మిస్ టీన్’గా ఇండో -అమెరిక‌న్!

మిస్ ఇండియా పోటీలు కానీ మిస్ యూనివ‌ర్స్ పోటీలు ఏమైనా కానీ అందులో విజ‌యం సాధించాలి అంటే అందం ఒక్క‌టే ఉంటే సరిపోదు. అందంతోపాటు తెలివి, న‌డ‌వ‌డిక కూడా అవ‌స‌రం అందుకే వాటికి అంత ప్ర‌ముఖ్య‌త సంత‌రించ‌కుంది. అయితే తొలిసారి మిస్ టీన్ తెలుగు యూనివ‌ర్స్ పోటీలు జ‌రిగాయి. ఇందులో 40 దేశాల నుంచి 700 మందికి పైగా అందాల బామ‌లు పాల్గొన్నారు. అందులో మంచి ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌ర్చిన ఇండో – అమెరిక‌న్ నిత్య కొడాలి విజేత‌గా నిలిచింది.

భారతీయ అమెరికన్ నిత్య కొడాలి మిస్ టీన్ తెలుగు యూనివర్స్ కి ఎంపికైంది. సెమీ-ఫైనల్స్‌కు మొత్తం 700 మంది చేరుకున్నారు. ఇందులో 22 మంది ఫైనల్స్‌కు ఎంకైనారు. భారత్, కెనడా, ఆస్ట్రేలియా, సింగ్‌పూర్, యూఏఈ, న్యూజిలాండ్ సహా 40 దేశాలకు చెంది ముద్దుగుమ్మ‌లు ఈ పోటీలో పాల్గొన్నారు. ప్రపంచంలో మిస్ టీన్ తెలుగు యూనివర్స్ పోటీలను జ‌ర‌ప‌డం ఇప్పుడే మొద‌టిసారి. ఈ అంతర్జాతీయ అందాల పోటీలో ఇంటర్ డక్షన్, ర్యాంప్ వాక్, ప్రతిభ, విజ్ఞానం మొద‌లైన అంశాలపై ప‌లు దశల్లో వడపోత జ‌రుగుతుంది.

అందం, ప్రతిభ, తెలివితేటలు, వాక్చాతుర్యం క‌లిగిన నిత్య కొడాలి న్యాయ నిర్ణేతలను ఆకట్టుకుంది. దాంతో మిస్ టీన్ తెలుగు యూనివ‌ర్స్ పోటీలో విజేత‌గా నిత్య కొడాలి నిలిచింది. మిస్ ఎర్త్ ఇండియా తేజస్వినీ మనోగ్నా నిత్య కొడాలికి కిరీటధారణ చేశారు. ఈ పోటీలను తొలిసారి నిర్వహించారు. అందులో తొలి టైటిల్‌ను నిత్య కొడాలి గెలుచుకోవడం ప్ర‌ముఖ్య‌త సంతరించుకుంది. సమయస్ఫూర్తితో సమాధానాలు చెప్పి కిరీటాన్ని కైవ‌సం చేసుకుంది.

అందంలోకే కాక చదువులోనూ చురుకుగా ఉండే నిత్య కొడాలి.. ఫ్యూచ‌ర్ లో మెడిసిన్ చ‌ద‌వాల‌ని అనుకుంటుంది. ఇప్ప‌టికే లెటర్స్ అండ్ లవ్ పేరుతో ఒక‌ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటుచేసి 20కిపైగా దేశాల్లో సేవలు కొనసాగిస్తోంది. అలాగే భరతనాట్యంలోనూ శిక్షణ తీసుకుంది. హౌస్టన్ బాలీవుడ్ డ్యాన్స్ బృందంలో మెంబ‌ర్ గా నిత్య ఉంది. త‌న ప్రతిభ, స్వచ్చంద సేవల‌కు ఇప్ప‌టికే ప‌లు అవార్డుల‌ను నిత్య అందుకుంది.