NewsOrbit
టాప్ స్టోరీస్ న్యూస్

ఎమ్మెల్యే, ఎంపీ అయినా ఇక జైలుకే..!! సిద్ధమవుతున్న కీలక ఫైల్..!

(న్యూఢిల్లీ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)

అధికారులు లంచం తీసుకుంటూ పట్టుబడితే కొంత కాలం విధులకు దూరంగా ఉంటారు. పోలీసులు లంచం తీసుకుంటే కొంత కాలం  విఆర్‌లో ఉంటారు లేదా సస్పెండ్ అవుతారు. అవినీతి అంటే ముందు అధికారులు మాత్రమే గుర్తు వస్తుంటారు. కానీ రాజకీయ అవినీతి గురించి ఇన్నాళ్లు పెద్దగా పట్టించుకోలేదు. కానీ నేరారోపణలు, క్రిమినల్ చరిత్ర, అవినీతి ఆరోపణలు ఉన్న ఏంతో మంది ఎమ్మెల్యేలుగా, ఎంపిలుగా మన దేశంలో చెలమణి అవుతున్నారు. వాళ్ళకు అడ్డుకట్టవేసే విధంగా ఓ కీలక దస్త్రం సుప్రీం కోర్టులో తయారు అవుతోంది. కేంద్రం, సుప్రీం కోర్టు అన్ని కలిపి ఈ కీలక దస్త్రాన్ని అమలులోకి తీసుకువచ్చేందుకు సిద్ధం అవుతున్నాయి. ఇది పక్కాగా అనుకున్నది అమలు అయినట్లు అయితే నేరారోపణ, నేర చరిత్ర, అవినీతి ఆరోపణలు ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపిలు, ప్రజా ప్రతినిధుల కేసులు సత్వరం పరిష్కరించేలా ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలనేది దీని ప్రధాన ఉద్దేశం.

supreme court

సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఎన్‌వి రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం బుధవారం ప్రజా ప్రతినిధులపై ఉన్న కేసుల విచారణను ఏడాది లోపు పూర్తి చేయాలన్న పిటిషన్‌పై విచారణ చేపట్టింది.  కోర్టుకు సహాయంగా అందించేందుకు నియమించబడిన అమికస్ క్యూరీ అన్సారీ ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులకు సంబంధించి 4,400లకు పైగా కేసుల  పెండింగ్‌లో ఉన్నాయని సుప్రీం కోర్టుకు నివేదించగా తాజాగా మరో సప్లమెంటరీ నివేదికను నేటి విచారణలో అందజేశారు. కేసుల సత్వర విచారణకు జిల్లాకు ఒక ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేస్తే బాగుంటుందని అమికస్ క్యూరీ న్యాయస్థానం అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. పలు రాష్ట్రాల్లో రెండు, మూడు కేసులే ఉన్న సందర్భంలో  అలాంటి వాటికి గానూ రాష్ట్ర హైకోర్టులకు కొన్ని ఆదేశాలు ఇస్తామని ధర్మాసనం తెలిపింది. కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడి నమోదు చేసి పలు కేసుల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు కానీ విచారణ ఇంక ప్రారభం కాలేదని అమికస్ క్యూరీ ధర్మాసనం దృష్టికి తీసుకువస్తూ వాటి విచారణకు ట్రయల్ కోర్టుకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

ధర్మాసనం ఎలంటి ఆదేశాలు ఇచ్చినా అమలు చేస్తామనీ, కేసుల సత్వర విచారణకు  తాము సిద్ధమేననీ సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పేర్కొంటూ ప్రత్యేక కోర్టులు, మౌళిక వసతుల కల్పనకు రెండు నెలల సమయం ఇవ్వాలని కోరారు. అమికస్ క్యూరీ, సోలిసిటర్ జనరల్ సూచనలను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం హైకోర్టు..ట్రయల్ కోర్టులకు రేపటి లోగా పలు ఆదేశాలు జారీ చేస్తామని పేర్కొన్నది. కాగా ప్రజా ప్రతినిధులు దోషిగా తేలితే వారు జీవిత కాలం ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా చేయాలని పిటిషనర్ అయిన బిజెపి నేత అశ్వినీకుమార్ ఉపాధ్యాయ ధర్మాసనాన్ని కోరగా ఈ అంశాన్ని తర్వాత పరిశీలిస్తామని ధర్మాసనం పేర్కొన్నది.

 

 

 

author avatar
Special Bureau

Related posts

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?