నందమూరి కళ్యాణ్ రామ్ తన నట విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నారు. మాస్ సినిమాల్లో వైరెటీ కాన్సెప్ట్ లకు పెద్ద పీట వేయడం కళ్యాణ్ రామ్ స్పెషాలిటీ అని చెప్పుకోవచ్చు. గతేడాది విడుదల ‘బింబిసార’ సినిమాలో తన యాక్టింగ్‌కు భారీగా ప్రశంసలు అందుకున్నారు. పౌరాణిక గెటప్‌లోనూ.. స్టైలిష్ లుక్‌లోనూ ఇరగదీశారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు బ్రేక్ చేసింది. కళ్యాణ్ రామ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా ఈ సినిమా నిలిచింది. ఈ సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’తో ముందుకొచ్చాడు. టైటిల్‌కు తగ్గట్లే సినిమాపై మొదటి నుంచి భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.

మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న ఈ చిత్రానికి రాజేంద్రరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. 2023లో మైత్రీ మేకర్స్ నిర్మాణంలో వస్తున్న మూడవ చిత్రమిది. తాజాగా చిత్ర యూనిట్ ‘అమిగోస్’ ట్రైలర్‌ను రిలీజ్ చేసింది. ఇందులో కళ్యాణ్ మూడు విభిన్న పాత్రల్లో కనిపించారు. సిద్ధార్థ్ (ఎంటర్‌ప్రెన్యూర్), మంజునాథ్ (సాఫ్ట్ వేర్ ఇంజినీర్), మైఖేల్ (గ్యాంగ్‌స్టర్)గా కనిపించారు. అయితే మైఖేల్ తనలాగే ఉన్న మరో ఇద్దరిని వెతికి పట్టుకుంటాడు. ఆ తర్వాత వాళ్లతో మైఖేల్ ఏం చేస్తాడనేది ‘అమిగోస్’ స్టోరీలా అనిపిస్తోంది. గ్యాంగ్‌స్టర్ అయిన మైఖేల్ ఎన్ఐఏ కళ్లు కప్పి ఎలా తప్పించుకుంటాడనే విషయాన్ని ట్రైలర్‌లో చూపించారు. ఇందులో కళ్యాణ్ రామ్ విలన్ కమ్ హీరో పాత్రలో కనిపించాడు.

అమిగోస్ ట్రైలర్‌కు భారీగా రెస్పాన్స్ వస్తోంది. సినిమాలో కళ్యాణ్ రామ్ నెగిటివ్ షేడ్.. మూవీపై భారీగా హైప్ పెంచినట్లు కనిపిస్తోంది. డైలాగులు కూడా అదిరిపోయాయి. యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా సినిమాను తెరక్కించినట్లు కనిపిస్తోంది. ‘మనం ఫ్రెండ్స్ కాదు.. బ్రదర్స్ అంతకన్నా కాదు.. జస్ట్ లుక్కేలైక్స్’, ‘నేను బెదిరించను.. చంపేస్తా’ వంటి డైలాగ్స్ విజిల్స్ వేసేలా ఉన్నాయి. యూట్యూబ్ విడుదలైన ఈ ట్రైలర్ గడిచిన 17 గంటల్లో 4.4 మిలియన్ వ్యూవ్స్ దక్కించుకుంది. ట్రైలర్‌తోనే సినిమాపై భారీ ఆశలు పెరిగాయి. సినిమా స్టోరీ పరంగా, కళ్యాణ్ రామ్ యాక్టింగ్ పరంగా ‘అమిగోస్’పై భారీ హైప్ క్రియేట్ అయింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుందని నందమూరి అభిమానులు భావిస్తున్నారు.

మూడు డిఫరెంట్ పాత్రల్లోనూ కళ్యాణ్ రామ్ తన మ్యానరిజంను చూపించాడు. కళ్యాణ్ రామ్ నెగిటివ్, పాజిటివ్ షేడ్స్ కు వందకు వంద శాతం మార్కులు పడ్డాయి. బింబిసారలో రెండు పాత్రలో అలరించిన కళ్యాణ్ రామ్.. ఇప్పుడు మూడు పాత్రల్లో కనిపిస్తూ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ‘యెకా యెకా’, ‘ఎన్నో రాత్రులొస్తాయి గానీ’ సాంగ్స్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఇక సినిమా ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఫిబ్రవరి 10 వరకు వేచి చూడాలి.