24.2 C
Hyderabad
February 5, 2023
NewsOrbit
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Amit Shah : మేనల్లుడు చాలు బీజేపీ మెడలు వంచడానికి!అమిత్ షాకు దీదీ స్ట్రాంగ్ కౌంటర్ !!

Share

Amit Shah : పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల వేడి మాంచి కాకమీదుంది. వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలని దీదీ..మొదటిసారిగా బెంగాల్ లో కాషాయ జెండా ఎగురవేయాలని కమలనాథులు ఎవరి ఎఫర్ట్ వారు పెడుతున్నారు.దీంట్లో భాగంగా పోటా పోటీగా ఎన్నికల క్యాంపెయిన్ లో మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. దీంట్లో భాగంగా దీదీ బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సవాల్ విసిరారు.అమిత్ షాకు తాను అవసరం లేదు.

Amit Shah Summoned By Bengal Court After Mamata Banerjee's Nephew Sues Him
Amit Shah Summoned By Bengal Court After Mamata Banerjee’s Nephew Sues Him

ధైర్యముంటే మొదట నా మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీపై ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన తర్వాతే తనను ఎదుర్కోవాలని షాకు సవాల్ విసిరారు. దక్షిణ పరగణాల జిల్లాలోని పైలాన్‌ ప్రాంతంలో జరిగిన ర్యాలీలో పాల్గొన్న దీదీ బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. షా తనమీదా తన పాలన మీద చేసే విమర్శలను తిప్పికొట్టారు. అమిత్ షా తనమీద కాదు ఆయనకు ధైర్యముంటే తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై గెలిచి తరువాత తనమీద విమర్శలు చేయాలని సవాల్ విసిరారు.

Amit Shah : అభిషేక్ అందరిలో ఒకడు

మమతా బెనర్జీది కుటుంబ పాలన అంటూ బీజేపీ చేసిన విమర్శలకు దీదీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మమతా తర్వాత టీఎంసీలో అభిషేక్ బెనర్జీకే అత్యంత ప్రాధాన్యత ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తృణమూల్‌ కూడా కుటుంబ రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తోందని బీజేపీ విమర్శిస్తోంది. సీఎం పీఠాన్ని అభిషేక్‌కు అప్పగించటానికి దీదీ యత్నిస్తున్నారని బీజేపీ చేస్తోన్న విమర్శలకు దీదీ దీటుగా బదులిచ్చారు. పార్టీలో అందరిలాగే అభిషేక్ కూడా ఒకరని..అతడికి ప్రత్యేక మినహాయింపులు ఉండవని స్పష్టంచేశారు దీదీ.

ఇదీ అభిషేక్ క్యారెక్టర్!

‘నాపై 1990 ఆగస్టులో కోల్‌కతాలో తనపైదాడికి పాల్పడేనాటికి అభిషేక్ చాలా చిన్నపిల్లాడు…అత్తా నీపై దాడి ఎందుకు జరిగిందని ప్రశ్నించాడని..జెండా పట్టుకుని చుట్టూ తిరుగుతూ నా ప్రశ్నకు సమాధానం చెప్పాలని నిలదీసేవాడని గుర్తు చేసుకున్నారు దీదీ..నాది కుటుంబపాలన అయి ఉంటే అభిషేక్‌‌ను నేరుగా రాజ్యసభ ద్వారా పార్లమెంట్‌కు పంపొచ్చు.. కానీ.. ప్రత్యక్షంగా ఎన్నికల్లో పాల్గొని ప్రజాతీర్పుతోనే లోక్‌సభలో అడుగుపెడతానని అన్నాడు. అదీ నా మేనల్లుడి నిబద్దత..అది బీజేపీకి ఎక్కడుందని ప్రశ్నించారు. నామీద విమర్శలు చేసే అమిత్ షా ముందుగా నా మేనల్లుడ అభిషేక్‌ బెనర్జీపై గెలిచి..అప్పుడు నాపై విమర్శలు చేయాలి’ అని మమతా అమిత్ షాకు సవాల్‌ విసిరారు.

అమిత్ షా కొడుకు మాదిరి కాదు!

అక్కడితో మమతా ఫైర్ తగ్గలేదు. అమిత్ షా కొడుకు వ్యాపారాలపై కూడా విరుచుకుపడ్డారు. జై షా క్రికెట్‌ అసోసియేషన్‌లో ఎలా స్థానం సంపాదించారనీ..వందల కోట్ల రూపాయలను ఎలా సంపాదిస్తున్నారో అమిత్ చిత్తశుద్ధితో చెప్పగలరా? అని ప్రశ్నించారు. దుమ్ముంటే అమిత్ షా తన కొడుకుని రాజకీయాల్లోకి తీసుకురావాలనీ మరో సవాల్ చేశారు. వచ్చే ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్ భారీ మెజార్టీతో విజయం సాధించి బీజేపీని నామరూపాలు లేకుండా బెంగాల్ నుంచి తరిమికొడతామని..గత ఎన్నికల రికార్డులను తిరగరాస్తామని మమతా ధీమా వ్యక్తం చేశారు.

 


Share

Related posts

Surekha Vani: ఆ రేంజ్‌లో అందాలు చూపించినా అవకాశాలు ఇవ్వడం లేదంటున్న సురేఖవాణి..!

Ram

ఆ రాష్ట్రంలో ప్లాస్మా డొనేట్ చేస్తే గవర్నమెంట్ జాబ్..?? 

sekhar

Karthika Deepam Jan 31 Today Episode: ఏంటి హిమ ఇలా చేసావ్… సౌర్య కోసం నువ్వు ఈ పని ఎలా చేయగలిగావు..?

Ram