బ్రేకింగ్: కరోనా నుండి పూర్తిగా కోలుకున్న అమిత్ షా

Share

కేంద్ర హోమ్ మంత్రి కరోనా నుండి పూర్తిగా కోలుకున్నారు. తాజాగా జరిపిన పరీక్షల్లో ఆయనకు కరోనా నెగటివ్ వచ్చింది. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా తెలియజేసారు. “తాజాగా జరిపిన పరీక్షల్లో నాకు కరోనా నెగటివ్ వచ్చింది. ఈ సందర్భంగా భగవంతునికి కృతఙ్ఞతలు చెబుతున్నా.

 

Amit Shah tests COVID negative in recent tests
Amit Shah tests COVID negative in recent tests

 

అలాగే నేను కరోనా నుండి కోలుకోవాలని ప్రార్ధించిన అందరికీ కృతఙ్ఞతలు చెబుతున్నా. వైద్యుల సలహా మేరకు మరికొన్ని రోజులు నేను ఐసోలేషన్ లోనే ఉంటా”నని అమిత్ షా ట్విట్టర్ లో తెలియజేసారు. కరోనా లక్షణాలు కనిపించడంతో ఈ నెల 2న అమిత్ షా కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని వచ్చిన విషయం తెల్సిందే. దీంతో ఢిల్లీలోని గురుగ్రామ్‌లోని మేదాంత హాస్పిటల్‌లో ఆయన చేరారు. ఎయిమ్స్ వైద్యులు అమిత్ షాకు ప్రత్యేక చికిత్స అందించినట్లు తెలుస్తోంది.

 


Share

Related posts

మాన‌వ‌త్వానికి మంట‌..! భార్య మంట‌ల్లో కాలుతుంటే.. భ‌ర్త ఫోన్‌తో.. ఛీ ఛీ వీడు మనిషేనా?

Teja

ఇంట్లో వైఫై సిగ్న‌ల్ స‌రిగ్గా రావ‌డం లేదా ? ఇలా చేయండి..!

Srikanth A

జనవరి 5 న విజయవాడలో 5లక్షల మందితో హనుమాన్ ఛాలీసా

Siva Prasad