24.2 C
Hyderabad
February 5, 2023
NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

TDP : టీడీపీ ఎంపీలకు అమిత్ షా అతి పెద్ద షాక్..! పార్టీ ఫ్యూచర్ డిసైడ్ అయినట్టే..!?

Share

TDP : ఆంధ్రప్రదేశ్‌లో అరాచకపర్వం కొనసాగుతోందని తెలుగుదేశం పార్ట ఎంపీలు ఆరోపించారు.

Amit Shah's biggest shock to TDP MPs ..!
Amit Shah’s biggest shock to TDP MPs ..!

బుధవారం సాయంత్రం పార్లమెంటు భవనంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన తెలుగుదేశం ఎంపీల బృందం, రాష్ట్ర ప్రభుత్వంపై ఫిర్యాదు చేసింది. తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత గల్లా జయదేవ్ నేతృత్వంలో హోంమంత్రిని కలిసిన ఈ బృందంలో ఎంపీలు కేశినేని నాని, కనకమేడల రవీంద్ర కుమార్ ఉన్నారు. అమిత్ షాకు అందజేసిన లేఖలో తొలుత దేవాలయాలపై దాడులు, బలవంతపు మతమార్పిళ్ల గురించి ప్రస్తావించారు. పాస్టర్ ప్రవీణ్ వ్యవహారం, 29,841 మంది క్రిస్టియన్ పాస్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ వేతనం అందజేయడం, టీటీడీలో పింక్ డైమండ్ మాయమవడం, అంతర్వేదిలో రథం దగ్దం, దుర్గమ్మ ఆలయంలో వెండి సింహం మాయమవడం, రామతీర్థంలో రాముడి విగ్రహం తలను విరగ్గొట్టడం వంటి ఘటనలను పొందుపరిచారు.

TDP : పెచ్చుమీరిన దౌర్జన్యాలు..కక్ష సాధింపు చర్యలు!

రెండో అంశంగా ప్రజాస్వామ్యంపై, రాజ్యాంగంపై దాడిని ప్రస్తావించారు. ఈ క్రమంలో శాసనమండలి రద్దు, న్యాయవ్యవస్థతో ఘర్షణ, ఆ వ్యవస్థపై మాటలదాడి గురించి లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘంపై కూడా ఇదే తరహాలో దాడి చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వానికి విమర్శిస్తున్న మీడియా సంస్థలపైనా దాడులు, వేధింపులు జరుగుతున్నాయని టీడీపీ నేతల లేఖలో పేర్కొన్నారు. మూడో అంశంగా రాష్ట్రంలో శాంతిభద్రతల గురించి ప్రస్తావిస్తూ అవి పూర్తిగా క్షీణించాయని ఆరోపించారు. బీసీలు, దళితులు, మైనారిటీలు, ఆదివాసీలు, మహిళలు అన్న తేడా లేకుండా అన్నివర్గాలపై వైకాపా నేతలు దాడులకు దిగుతున్నారని విమర్శించారు. అలాగే ప్రతిపక్ష పార్టీ నేతలపై కక్షసాధింపు ధోరణితో తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని అన్నారు. కోడేల శివప్రసాద్, నన్నపనేని రాజకుమారి, కొల్లు రవీంద్ర, కళా వెంకట్రావుపై కేసులు, మాట్లాడే స్వేచ్ఛకు భంగం కలిగేలా అరెస్టులు జరుగుతున్నాయని దుయ్యబట్టారు.

ఆకాశమే హద్దుగా అవినీతి!

నాలుగో అంశంగా మూడు రాజధానుల గురించి ప్రస్తావిస్తూ అమరావతిని దెబ్బతీయడం కోసమే ఈ ప్రతిపాదన తీసుకొచ్చారని తెలుగుదేశం ఎంపీలు లేఖలో పేర్కొన్నారు. ఐదో అంశంగా రాష్ట్ర ప్రభుత్వం తీవ్రస్థాయి అవినీతి, కుంభకోణాలకు పాల్పడుతోందని విమర్శించారు. అక్రమ ఇసుక తవ్వకాలు, ఇతర ఖనిజాల అక్రమ మైనింగ్, భూసేకరణలో అక్రమాలకు పాల్పడుతున్నారని, వైసీపీ నేతలు భూకబ్జాలు చేస్తున్నారని ఆరోపించారు. చివరి అంశంగా రాష్ట్ర ప్రభుత్వం పాలనలో పూర్తిగా విఫలమైందని, కోవిడ్-19 నియంత్రణలో విఫలమవడంతో పాటు పెట్టుబడులకు ముందుకురాలేని స్థితిలో ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోల్పోయిందని ఆరోపించారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేస్తూ, అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని రాజ్యాంగబద్ధంగా పాలన సాగేలా చూడాలని అమిత్ షాను కోరారు.

అమిత్ షా నుండి సానుకూల స్పందన!

కాగా తమ ఆరోపణలన్నిటికీ సంబంధించిన సంబంధించిన ఆధారాలు హోంమంత్రికి సమర్పించామని కనకమేడల తెలిపారు. ఇంకా ఏమైనా ఆధారాలు, వీడియోలు ఉంటే కూడా హోంశాఖ కార్యాలయానికి ఇవ్వాలని అమిత్ షా తమతో చెప్పినట్టు ఆయన వివరించారు.హోంమంత్రి తాము చెప్పింది శ్రద్ధగా విన్నారని సానుకూలంగా స్పందించారని కనకమేడల చెప్పారు.

 


Share

Related posts

నేడు, రేపు హస్తినలోనే ఏపీ సీఎం వైఎస్ జగన్.. ప్రధాని మోడీ సహా కేంద్ర మంత్రులతో కీలక భేటీలు

somaraju sharma

‘నేను సూపర్’

somaraju sharma

రష్మిక మందన్న ఎందుకంత టెన్షన్ పడుతుంది ..అప్పుడే ఏమీ జరిగిపోలేదు కదా ..?

GRK