NewsOrbit
న్యూస్

YS Jagan: సీఎం జగన్ కు అమిత్ షా అల్టిమేటం !ఏ విషయంలో అంటే??

AP Special Status: Have Power but full of risk

YS Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా తయారైనట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.ఇటీవల ఢిల్లీ పర్యటన సందర్బంగా జగన్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసినప్పుడు ఆయన బేషరతుగా ఎన్డీయేలో చేరాల్సిందిగా ముఖ్యమంత్రిని కోరినట్లు చెబుతున్నారు.

Amit Shah's ultimatum to CM Jagan!
Amit Shahs ultimatum to CM Jagan

అమిత్ షా ఏం చెప్పారంటే?

కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమైనా సాయం సహకారం కావాలంటే ఎన్డీయేలో చేరితీరాలని అమిత్ షా తనదైన శైలిలో జగన్ కి స్పష్టం చేశారని ఢిల్లీ నుండి వార్తలు అందుతున్నాయి.ఇందుకు ప్రతిఫలంగా వైసిపికి చెందిన ఇద్దరికి కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పిస్తామని ఆయన ఆఫర్ చేశారంటున్నారు.ప్రధాని నరేంద్రమోడీ కూడా ఇందుకు సమ్మతించారని అమిత్ షా ఏపీ ముఖ్యమంత్రి కి చెప్పారని టాక్. వచ్చే వారమే కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరగబోతోందని,ఈ టెర్ములో ఇదే ఆఖరి విస్తరణ అని,ఇప్పుడు అవకాశం మిస్తైతే ఇక దొరకబోదని అమిత్ షా చెప్పేశారట. ఈ విషయంలో ఆలోచించి త్వరగా నిర్ణయం తీసుకుని తమకు తెలియచేయాలని కేంద్ర హోంమంత్రి ఆయనను కోరారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

YS Jagan: ఇరకాటంలో పడ్డ సీఎం?

అమిత్ షా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడటంతో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తీవ్ర ఇరకాటంలో పడినట్లు తెలుస్తోంది.నిజానికి ఎన్డీయేలో చేరడానికి జగన్ సిద్ధంగా లేరు.కేంద్రం ఇప్పటివరకు రాష్ట్రానికి చేసిందేమీ లేదని,రాష్ర్టానికి ప్రత్యేక హోదా విషయం లో ఎన్డీయే ప్రభుత్వ వైఖరిలో మార్పు లేదని,అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ నిధులను కూడా కుదించేసారని సీఎం అసంతృప్తిగా ఉన్నారు.ఈ పరిస్థితుల్లో ఎన్డీయేలో వైసీపీ గనుక చేరినట్లయితే కేవలం కేసులు నుండి బయటపడటానికే తాను బీజేపీ ముందు మోకరిల్లానన్న అపప్రద రాగలదని సీఎం భావిస్తున్నారు.ప్రత్యేక హోదా విషయంలో ఒక అనుకూల ప్రకటన, పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల నిధుల పెంపు వంటి ప్రకటనలు కేంద్రం గనుక చేస్తే తాను ఎన్డీయేలో చేరినా దాన్ని సమర్థించుకోవడానికి వీలుంటుందని ఆయన తలపోస్తున్నారు.కానీ మూడు రాజధానుల బిల్లు,రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు తో తలనొప్పి,సీబీఐ కేసులవంటివి జగన్ మెడపై వేలాడుతున్న కత్తులని ఒక రాజకీయ విశ్లేషకుడు పేర్కొన్నారు.ఈ పరిస్థితుల్లో జగన్ ఎన్డీయేలో చేరుకున్నా ఇబ్బందులు తప్పవన్నారు. ఎన్డీయేలో చేరితే ఒక తంటా.. లేకుంటే మరో ప్రమాదం గా మారిన ఈ పరిస్థితుల్లో జగన్ ఏం చేస్తారన్నది చూడాలి.

 

author avatar
Yandamuri

Related posts

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N