Amitabh Bachchan: రెండు కోట్లు దానం చేసిన అమితాబ్ బచ్చన్..!!

Share

Amitabh Bachchan: కరోనా నేపథ్యంలో చాలామంది స్టార్ హీరోలు ప్రముఖులు సెలబ్రిటీలు అనేక రకాలుగా సహాయ పడిన సంగతి తెలిసిందే. ప్రభుత్వాలకు విరాళాలు పేదవాళ్లకు ఆహార పొట్లాలు ఆర్థికంగా ఆదుకోవడంతో అదేరీతిలో కరోనా రోగులకు ట్రీట్ మెంట్ విషయంలో రకరకాలుగా సహాయం చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా అందరి హీరోలకంటే ఈ విషయంలో సోను సూద్ ముందు నుండి కీలకంగా రాణిస్తూ ఉన్నారు. గత ఏడాది లాక్ డౌన్ అమలు చేయడంతో… అప్పటి నుండి వలస కూలీల ను గమ్యస్థానాలకు చేర్చడం నుండి స్టార్ట్ చేసి ఇప్పటివరకు అనేక రీతులుగా పేదవాళ్లకి కరోనా రోగులకు.. సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు.

Amitabh Bachchan donates ventilators, medical equipment worth Rs 1.75 crore  to civic hospital in Mumbai

టాలీవుడ్ ఇండస్ట్రీలో చిరంజీవి బాలకృష్ణ ఇంకా చాలామంది స్టార్ హీరోలు హీరోయిన్లు.. కరోనా సెకండ్ వేవ్ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో కరోనా రోగులకు అనేకరకాలుగా సహాయపడ్డారు. ఇదిలా ఉంటే తాజాగా బాలీవుడ్ ఇండస్ట్రీ బిగ్ బి అమితాబ్ ముంబైలోని సీఎన్ హాస్పిటల్ కి.. రెండు కోట్ల రూపాయలు సహాయం అందించారు. వెంటిలేటర్లు, మానిటర్లు, సిఆర్ఎం ఇమేజ్ ఇంటేన్సి ఫైయర్లు… ఇన్స్యూషన్..పంపులు తదితర వైద్య పరికరాలు ముంబైలోని సీఎన్ హాస్పిటల్ కి అందజేయడం జరిగింది.

Read More: Bollywood: బాలీవుడ్ స్టైల్ లో దేవిశ్రీప్రసాద్ పాటలు..!!

మహారాష్ట్రలో మళ్లీ కేసులు పెరుగుతూ ఉండటంతో.. అక్కడి రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అవుతుంది. ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీ షూటింగ్ కి అడ్డా ముంబై కావడంతో అక్కడి హాస్పిటల్స్ కరోనా విషయంలో ఎటువంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కొనే స్థితిలో పరికరాలు రెడీ చేసుకుంటూ ఉన్నాయి.


Share

Related posts

ఒక మర్డర్ – ఒక చంద్రబాబు – ఒక వై ఎస్ జగన్ – ఒక ఆంధ్రప్రదేశ్

arun kanna

బ్రేకింగ్: తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన 30 ఇయర్స్ పృథ్వీ

Vihari

అయ్యబాబోయ్! అమెజాన్ సంస్థ చాలా పెద్ద ప్లాన్ వేసింది.. ఇక ఇండియా లో థియేటర్లన్నీ… !! 

Naina