NewsOrbit
న్యూస్

సుజన చౌదరి మీడియా డిల్లీ హై కమాండ్ చర్యలు ?? సీరియస్ గా ఉన్న అమిత్ షా ? 

తెలుగుదేశం పార్టీ వీర విధేయుడిగా చంద్రబాబు కి అత్యంత సన్నిహితుడిగా ఉండే సుజనా చౌదరి 2019 ఎన్నికలలో టీడీపీ దారుణంగా ఓడిపోయిన వెంటనే బీజేపీ తీర్థం పుచ్చుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఆయన బీజేపీ పార్టీలోకి వెళ్లడం వెనకాల చంద్రబాబు హస్తం ఉందని చాలామంది అంటారు. ఆ విషయం పక్కన పెడితే, ఇటీవల రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో సుజనా చౌదరి మరియు కామినేని శ్రీనివాస్ పార్క్ హయత్ హోటల్ లో భేటీ అవ్వటం ఏపీ రాజకీయాలను కుదిపేసిన సంగతి అందరికీ తెలిసిందే. రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి కొన్ని విమర్శలు మూటగట్టుకుని ఆ విషయం న్యాయస్థానంలో ఉన్న సమయంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో బీజేపీ పార్టీకి చెందిన నాయకులు కలవటం పట్ల జాతీయ మీడియాలో కూడా వార్తలు వైరల్ అయ్యాయి.

TDP quitting NDA unfortunate, politically motivated: Amit Shah in ...

అయితే ఈ విషయంలో బీజేపీ హైకమాండ్ అధ్యక్షుడు జేపీ నడ్డా అదేవిధంగా రాష్ట్ర నేతలను వివరణ కోరినట్లు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని అసలు ఈ విధంగా కలవడం వెనుక ఆంతర్యం ఏమిటి అన్నదాని విషయంలో స్పష్టత ఇవ్వాలని ఢిల్లీ బీజేపీ పెద్దలు సీరియస్ అయ్యారట. ముఖ్యంగా సుజనాచౌదరి తన ప్రమేయం తోనే ఈ భేటీ జరిగినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడంతో ఈ పోస్ట్ ను ఉద్దేశించి అమిత్ షా సీరియస్ గా ఉన్నట్లు టాక్. బీజేపీ పార్టీలో ఉండి ఎవరి ఆదేశాలను సారంగా ఇలాంటి రాజకీయాలు చేస్తున్నారని జరిగిన పార్క్ హయత్ హోటల్ సమావేశంపై కామినేని శ్రీనివాస్ మరియు సుజనా చౌదరి వ్యవహారంపై ఢిల్లీ పెద్దలు అగ్గిమీదగుగ్గిలం అన్నట్టుగా రియాక్ట్ అవుతున్నట్లు సమాచారం.

Nimmagadda Ramesh Kumar Secret Meeting With YS Chowdary and ...

మొత్తంమీద చూసుకుంటే రాబోయే రోజుల్లో ఈ విషయంపై సుజనా చౌదరి కి అదేవిధంగా కామినేని శ్రీనివాస్ కి భారీ స్థాయిలో ఢిల్లీ పెద్దల హైకమాండ్ అక్షింతలు పడే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు. వస్తున్న వార్తలను బట్టి చంద్రబాబు డైరెక్షన్లో వీళ్లు పని చేసినట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో… బిజెపి పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీ ప్లాన్లు అమలు చేయడం ఏంటి అనే దిశగా ఈ నాయకులను ఢిల్లీ బీజేపీ నేతలు చెడుగుడు ఆడటానికి రెడీగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోపక్క ఇదే విషయంపై రాష్ట్ర బీజేపీ పార్టీ నేతలు కూడా సీరియస్ అవుతున్నారట. వాళ్లంతా తెలుగుదేశం పార్టీ ఇన్ఫార్మర్ లు వాళ్లు పార్టీలో ఉండటం వల్ల పార్టీకి డ్యామేజీ తప్ప లాభం ఉండదని లోలోపల చర్చించుకుంటున్నారట.

Related posts

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju