బిగ్ బాస్ సీజన్ 4 రోజు రోజుకి అదరగొడుతోంది. హౌస్ లో పిల్లలు లాగా మారిన బిగ్ బాస్ కంటెస్టెంట్ లు ఉన్న కొద్ది రాక్షసుల మారిపోయి అరాచకం సృష్టిస్తున్నారు. కేర్ టేకర్ ల గ్రూపును బెంబేలెత్తిస్తున్నరు. దొరక్క దొరక్క దొరికిన ఏమో కాని సోహెల్ కి… చుక్కలు చూపిస్తుంది “విమెన్ వారియర్” గా పేరు తెచ్చుకున్న ఆరియనా. దీంతో ఎంత కోపం ఆవేశం ఉన్నాగాని సోహైళ్ మాత్రం చాలా ఓపికగా నవ్వుతూనే భరిస్తున్నాడు.
మరోపక్క మాస్టర్ అమ్మ రాజశేఖర్ కి కంటెస్టెంట్ అభిజిత్ డైపర్ తోడాగాల్సిన పరిస్థితి వచ్చింది. కండలవీరుడు మెహబూబ్ ని అయితే ఎత్తుకుని తిప్పాల్సిన పరిస్థితి అఖిల్ కి ఏర్పడింది. అవినాష్… అరియనా ఒకే చోట ఉంటూ సొహైళ్ కి తెగ చుక్కలు చూపిస్తున్నారు. ఇదిలా ఉండగా హారిక పిల్లల టీం లో ఉండటంతో కొంటెపిల్ల గా మారి… పక్కవారి పెన్సిలు దొంగిలించే కార్యక్రమం స్టార్ట్ చేసింది.
అంతేకాకుండా మాస్టర్ ని గిచ్చుతూ రాక్షసుల లాగా ఏడిపిస్తూ ఉండటంతో… మాస్టర్ కూడా పిల్లల టీంలో కావటంతో హారిక చెంప మీద కొట్టాడు. అయినా కానీ పిల్లల క్యారెక్టర్ లోనే ఉంటూ హారిక మాస్టర్ పై పగ తీర్చుకుంది. ఆమె కొరకడంతో మాస్టర్ కూడా కొరికాడు. ఇలా ఇద్దరూ దెబ్బలు అడ్డుకున్నారు. మధ్యలో అభి వచ్చే హారికను మెంటల్ అనేశాడు. ఈ అన్ సీన్ ఈ వీడియో చూసిన నెటిజన్లు… ఇది బిగ్ బాస్ స్కూల్ లా లేదు, మెంటల్ హాస్పిటల్ లా ఉంది అంటూ కామెంట్ చేస్తున్నారు.