NewsOrbit
న్యూస్

అమరావతి అయిపోయింది ఇక అంబేద్కర్ మీద బాబు రాజకీయం!

విజయవాడ పీడబ్యూడీ గ్రౌండ్స్ లో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుని రాష్ట్రమంతా స్వాగతించింది. దళితులు తమ ఆరాధ్య దైవం నిలువెత్తు విగ్రహం విజయవాడలో ఏర్పాటు చేస్తుండటంపై సంతోషం వ్యక్తం చేశారు.

 

 

అదే జరిగితే చంద్రబాబుకి ఆ విగ్రహం చూసినప్పుడల్లా తల కొట్టేసినట్టవుతుంది. అమరావతి పేరు చెప్పి ఐదేళ్లు నాటకం ఆడిన బాబుని కాదని, ఏడాది లోగా విజయవాడలో శంకుస్థాపన చేశారు జగన్. మరో ఏడాది తిరిగేలోగా విగ్రహం ప్రారంభమైతే బాబు పరువేం కాను?
అందుకే తమ పార్టీకి అనుకూలంగా ఉన్న కొందరిని రెచ్చగొట్టి జగన్ పై ఆరోపణలు చేయిస్తున్నారు బాబు. ఇడుపులపాయ నుంచి విజయవాడలో విగ్రహ స్థాపనకు ఆన్ లైన్లో శంకుస్థాపన చేయడం వారికి నచ్చలేదట. అందుకే జగన్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలట. ఇంత వితండవాదం ఎక్కడా మనం వినలేదు.
కనీసం విమర్శ చేయడానికైనా సరైన పాయింట్ ఉండాలి కదా. ఆన్ లైన్లో శంకుస్థాపన చేసినంత మాత్రాన అట్రాసిటీ కేసు పెట్టాలనడం, దాన్ని రాజధానికి లింక్ పెట్టి మాట్లాడ్డం ఎంతవరకు సమంజసం. ఇకనైనా దళిత, బలహీన వర్గాలు నిజమైన అభివృద్ధిని, తమ ఉన్నతికి పాటుపడిన వ్యక్తిని గుర్తించాలి. ప్రతిపక్షాల మాయ నుంచి బైటపడాలి.
ఏపీ చరిత్రలో ఎవరూ చేయని విధంగా ఎస్సీ మహిళకు హోం మంత్రి పదవి ఇచ్చారు జగన్. ఎస్టీ మహిళను మంత్రిని చేశారు. అప్పటి అధికార పార్టీ చిత్ర హింసలు పెట్టినా తప్పుడు కేసుని ఒప్పుకోకుండా జగన్ కోసం నిలబడ్డ ఓ సాధారణ ఎస్సీ ఫొటోగ్రాఫర్ ని పార్లమెంట్ కి పంపించారు. పోలీస్ స్టేషన్లో ఎస్సీపై దాడి జరిగిందనే సమాచారంతో.. నిజనిర్థారణ జరక్కముందే ఎస్సైని సస్పెండ్ చేయించి.. డీజీపీని ఆ కేసుపై దృష్టిపెట్టాలని ఆదేశించారు. విజయవాడ నడిబొడ్డున 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహానికి శంకుస్థాపన చేశారు. జగన్ చేస్తున్న ఈ పనులు చూసైనా “ఆ కొంతమంది” దళితులు మారాలి.అయితే ఇందుకు భిన్నంగా ముఖ్యమంత్రి జగన్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలనిఅమరావతి దళిత ఐకాస డిమాండ్ చేయడ౦ వచ్చి రాజకీయ అవకాశవాదం .విజయవాడ స్వరాజ్య మైదానంలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుని వీరు వ్యతిరేకిస్తున్నారు. అసలు ఉందో లేదో తెలియని అమరావతిలో దళిత ఆశాజ్యోతి విగ్రహం కావాలట. అసలా డిమాండ్ లోనే డొల్లతనం ఉంది.దళితవాదులు తెలుసుకోవాల్సింది ఇదే!

author avatar
Yandamuri

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!