నటనకు ప్రాంతం, భాషతో ఏ మాత్రం సంబంధం లేదు. సినీ ఇండస్ట్రీలో తమ టాలెంట్‌ను ప్రూవ్ చేసుకోవడానికి దేశాలు, రాష్ట్రాలు దాటేసి వస్తుంటారు. సినీ రంగంలో హీరో, హీరోయిన్లుగా రాణించడానికి తెగ ప్రయత్నాలు చేస్తుంటారు. సాధారణంగా టాలీవుడ్, బాలీవుడ్‌లో ఇతర భాషలకు చెందిన హీరోయిన్లను మనం చూస్తుంటాం. వీరిలో కొందరు విదేశీ ముద్దుగుమ్మలు కూడా ఉంటారు. వీరిలో అమీ జాక్సన్ ఒకరు. టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించుకున్న ఈ భామ.. సౌత్ ఇండియాలోనే కాదు.. దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది ఈ ఫారెన్ బ్యూటీ. కెరీర్ తొలినాళ్లలో అవకాశాల కోసం ఎన్నో స్ట్రగుల్స్ పడింది. ఇలాంటి ఈ భామ ఇండియన్ సినిమాల నుంచి డీసీ కామిక్స్ సిరీస్‌లో నటించే స్థాయికి ఎదిగింది. నేడు (జనవరి 31) ఈ బ్రిటిష్ భామ పుట్టిన రోజు. అమీ జాక్సన్ జీవితం, సినిమాలు, తదితర విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

వ్యక్తిగత జీవితం
ఐరిష్ సముద్రం మధ్యలోని ఐస్లే ఆఫ్ మాన్ అనే ద్వీపంలో అమీ జాక్సన్ పుట్టారు. ఆమె తల్లిదండ్రులు బ్రిటీష్ క్రిష్టియన్స్. తండ్రి అలన్ జాక్సన్, తల్లీ మార్గరీటా జాక్సన్, అక్క అలిసియా జాక్సన్. అమీకి రెండేళ్ల వయసు ఉన్నప్పుడు లివర్ పూల్‌లోని వూల్టన్‌కు ఇంటిని మారిపోయారు. అమీ తండ్రి బీబీసీ రేడియో మెర్సిసిడ్‌కు నిర్మాతగా వ్యవహరిస్తుంటారు. అందుకే వూల్టన్‌కు షిప్ట్ అవ్వాల్సి వచ్చింది. సెయింట్ ఎడ్వర్డ్స్ కళాశాలలో అమీ చదువుకుంది. ఆ తర్వాత ఆంగ్ల భాష, ఆంగ్ల సాహిత్యం, తత్త్వ శాస్త్రం, నీతిశాస్త్రం చదువుకునేందుకు ఆరవ ఫారంలోకి చేరింది. 2015లో జార్జ్ పనయియోటౌతో కలిసి ఉంది. 2019లో వీరిద్దరూ విడిపోయారు. అప్పుడు వీరిద్దరికి ఒక కుమారుడు పుట్టాడు. ప్రస్తుతం అమీ ఎడ్ వెస్ట్ విక్‌తో డేటింగ్ చేస్తోంది.

సినీ కెరీర్ ప్రారంభం
ఎమీ జాక్సన్ బ్రిటన్‌కు చెందిన భారతీయ మోడల్. తన 16వ ఏటనే మోడల్‌గా కెరీర్ స్టార్ట్ చేసింది. 2009లో మిస్ టీన్ వరల్డ్ గానూ, 2010లో మిల్ లివర్ పూల్‌గానూ ఎంపికైంది. తమిళ సినీ దర్శకుడు ఏఎల్.విజయ్ దర్శకత్వంలో వచ్చిన ‘మద్రాసపట్టిణం’ సినిమాలో హీరోయిన్‌గా సెలెక్ట్ అయింది. లండన్‌లో మోడల్‌గా కొనసాగుతూనే.. భారత్‌లో వివిధ భాషల్లో సినిమాలు చేసింది. ఇప్పటివరకు తమిళ, హిందీ, తెలుగు సినిమాల్లో నటించింది. బాలీవుడ్‌లో ‘ఏక్ దీవానా థా’ సినిమాతో ఎంట్రీ ఇవ్వగా.. టాలీవుడ్‌లో ‘ఎవడు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును, ఫ్యాన్ ఫాలొయింగ్‌ను సంపాదించుకుంది. 2017లో వార్నర్ బ్రదర్స్ టెలివిజన్ ప్రొడక్షన్ డీసీ కామిక్స్ సూపర్ గర్ల్ తో ఇమ్రా ఆర్డీన్/సాటర్న్ గర్ల్ గా యూఎస్‌లో ఆరంగేట్రం చేసింది. ఆనంద వికటన్ సినిమా అవార్డు, సిమా అవార్డు, లండన్ ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డును అందుకున్నారు. డిజైరబుల్ ఉమెన్ ఆఫ్-2014, మోస్ట్ ప్రామిసింగ్ ఫిమేల్ న్యూకమర్స్ ఆఫ్-2012 లిస్ట్ లో అమీ జాక్సన్ ఎంపికయ్యారు.

సోషల్ మీడియాలోనూ ఫుల్ క్రేజ్
అమీ జాక్సన్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా కనిపిస్తుంటారు. తనకు సంబంధించిన డైలీ యాక్టివిటీనీ ఫోటోలు, వీడియోల రూపంలో షేర్ చేస్తుంటారు. అలాగే అప్పుడప్పుడు హాట్ ఫోటోలతో కూడా దర్శనం ఇస్తుంటారు. హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ.. సోషల్ మీడియాను షేక్ చేస్తుంటుంది అమీ జాక్సన్. అలా సోషల్ మీడియాలోనూ తన ఫాలొయింగ్‌కు పెంచుకుంటోంది. బెసిక్‌గా అమీ మోడల్ కాబట్టి.. తన డ్రెస్సింగ్ స్టైల్‌తో అందరినీ తనవైపు ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటుంది.