NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Jagan: చంద్రబాబును నమ్మడం అంటే కాటేసే పామును నమ్మడమే – జగన్  

YS Jagan: అనకాపల్లి జిల్లా పిసినికాడ లో వైఎస్ఆర్ చేయూత నాలుగో విడత నిధులను బటన్ నొక్కి సీఎం జగన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ బహిరంగ సభలో మాట్లాడుతూ..అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ముందు రోజున నా అక్కచెల్లెమ్మల ఆత్మగౌరవానికి, ఆర్ధిక సాధికారతకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ ఈ 58 నెలల పరిపాలనలో ప్రతి అడుగూ నా అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటూ ఊ రోజు ఆ అడుగులో భాగంగా వైఎస్ఆర్ చేయూత కార్యక్రమాన్ని మీ అందరి సమక్షంలో అనకాపల్లి నుండి శ్రీకారం  చుడుతున్నామన్నారు.

భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో అక్కచెల్లెమ్మల సాధికారత పట్ల ఇంత చిత్తశుద్ది చూపించిన ప్రభుత్వం ఎక్కడా లేదని అన్నారు.  వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం కింద నాలుగో విడత 22,98,931 మందికి నేరుగా రూ.5,060 కోట్లు ఈ రోజు నుండి మరో 14 రోజుల్లో వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయన్నారు. ఈ పథకం కింద 58 నెలల కాలంలో 33,14,916 మందికి రూ.19,189 కోట్లు నేరుగా వారి ఖాతాల్లోకి పంపించినట్లు అయ్యిందన్నారు. అలానే ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల ద్వారా అందిస్తున్న లబ్దిని వివరించిన సీఎం వైఎస్ జగన్.. గత ప్రభుత్వం ఇవేమీ అమలు చేయలేదన్నారు. చంద్రబాబు అయిదేళ్ల పాలనలో పేదల ప్రజలకు ఒక్క రూపాయి అయినా బ్యాంక్ ఖాతాల్లో నేరుగా జమ అయినట్లు కనిపించిందా అని ప్రశ్నించారు.

ఎన్నికలప్పుడు మాట ఇవ్వడం, ఒక మేనిఫెస్టో అని రంగురంగుల కాగితాలు చూపించడం, ఎన్నికలయ్యాక చెత్తబుట్టలో పడేసే పరిస్థితిని మార్చి విశ్వసనీయత అన్న పదానికి అర్ధం చెబుతూ మేనిఫిస్టోలో ఇచ్చిన ప్రతి హామీని ఏకంగా 99 శాతం హామీలను అమలు చేసి అక్క చెల్లెమ్మల కుటుంబాలకు చూపించి ఆశీస్సులు కోరుతున్న ప్రభుత్వం ఎక్కడైనా ఉందంటే అది మీ బిడ్డ ప్రభుత్వం మాత్రమేనని అన్నారు. చంద్రబాబు పేరు చెబితే మోసాలు, వంచన గుర్తుకొస్తాయని అన్నారు. మరి దత్తపుత్రుడు పేరు చెబితే వివాహ వ్యవస్థకే ఓ కళంకం, ఓ మాయని మచ్చ గుర్తుకొస్తాయని, కార్లు మార్చినట్లు భార్యలను మార్చేది, ఈ విలువలు లేని ఈ దత్తపుత్రుడే అని గుర్తుకొస్తుందన్నారు.

వీరు ఇద్దరూ కలిసి 2014 ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని, ప్రజలను మోసం చేశారని విమర్శించారు. చంద్రబాబును నమ్మడం అంటే కాటేసే పామును నమ్మడమేనని, వీరిని నమ్మడం అంటే తినేసే పులినని ఇంటికి తెచ్చుకోవడమేనని అన్నారు. ఈ 58 నెలల కాలంలో మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంది అనుకుంటే మాత్రం మీరంతా మీ బిడ్డకు సైనికులా, స్టార్ క్యాంపెయినర్లుగా మారి మీరే ముందుకు రావాలని జగన్ కోరారు. దేవుడి చల్లని దీవెనలు, మీ ఆశీస్సులు ఎప్పుడూ మీ బిడ్డ ప్రభుత్వం మీద ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు.

YSRCP: ముద్రగడతో వైసీపీ నేతల కీలక భేటీ .. పార్టీలోకి ఆహ్వానం

author avatar
sharma somaraju Content Editor

Related posts

Breaking: విజయవాడలో సీఎం జగన్ పై రాయితో దాడి .. ఎడమ కంటి పైభాగంలో గాయం

sharma somaraju

YS Jagan: జగన్ బస్సు యాత్రలో అరుదైన అతిధి .. బస్సు యాత్రకు వైఎస్ భారతి సంఘీభావం

sharma somaraju

YS Jagan: ఇళ్ల పట్టాలు ఎందుకు ఆపిచ్చాడంటూ చంద్రబాబు నిలదీయండి – జగన్

sharma somaraju

అమ్మ, అత్త, ఒక అన్న, ఇద్దరు చెల్లెళ్లు.. వైఎస్ కుటుంబ గొడ‌వ‌ల్లో కొత్త ట్విస్ట్ ఇది..!

టీడీపీ – వైసీపీలో ఈ ఫ్యామిలీ ప్యాకేజ్ ప్ర‌చారాలు చూశారా…?

కంచుకోట‌లో టీడీపీని స్వ‌యంగా ఓడిస్తోన్న చంద్ర‌బాబు… !

వైసీపీలో ఈ సీట్లు మార్పు ఖాయం.. కేఈకి రిజ‌ర్వ్‌.. !

Congress: వైసీపీకి మరో ఎమ్మెల్యే రాజీనామా .. షర్మిల సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక

sharma somaraju

Telangana Lok Sabha Elections: కాంగ్రెస్, బీజేపీ హోరా హోరీ .. ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయంటే..?

sharma somaraju

Lok sabha Elections 2024: ప్రధాని మోడీ విమర్శలపై ఘాటుగా స్పందించిన మల్లికార్జున ఖర్గే .. రిప్లై ఇలా..

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Telangana Lok Sabha Election: వరంగల్ ఎంపీ అభ్యర్ధిని ప్రకటించిన బీఆర్ఎస్

sharma somaraju

AP Elections 2024: చంద్రబాబు నివాసంలో ఎన్డీఏ కూటమి నేతల కీలక సమావేశం .. ఎందుకంటే..?

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ కేసులో ప్రధాన నిందితుల అరెస్టు ..టోపీ ఆధారంగా నిందితుల పట్టివేత

sharma somaraju

Ananya: జ‌ర్నీ హీరోయిన్ అన‌న్య ఏమైపోయింది.. ఆమె ఆర్చరీలో స్టేట్ ఛాంపియన్ అని మీకు తెలుసా?

kavya N