ఆనంద్ మ‌హీంద్రా ‘ట్వీట్’లోని ‘ట్విస్ట్’కు షాక్ అవుతున్న జ‌నం!

క‌రోనా వైర‌స్ తెచ్చిన న‌ష్టం ఇంకా పూర్తిగా దూర‌మే కాలేదు. ఏదో త‌గ్గుతుందిలే అనుకునే స‌రికి మ‌ళ్లీ సెకెండ్ వేవ్ అంటూ భ‌య‌పెడుతోంది. దీనికి శాశ్వ‌త ప‌రిష్కారం కేవ‌లం వాక్సిన్ వ‌చ్చినాకే అని ఎంతో మంది వైద్యులు అభిప్రాయ ప‌డుతున్నారు. వాక్సిన్ వ‌చ్చే వ‌ర‌కు భ‌య‌ట ఎక్కువ‌గా తిర‌గ‌కుండా.. జ‌న స‌ముహం ఉండే ప్లేసుల‌కు పోకుండా ఉండాలని సూచిస్తున్నారు. అలాగే బ‌య‌ట అడుగు పెట్టాల్సి వ‌స్తే.. మూతికి మాస్క్, సానిటైజ‌ర్ త‌ప్ప‌క తీసుకుపోవాల‌ని సూచిస్తున్నారు.

కాద‌ని మీరు ఇష్ట‌మొచ్చిన‌ట్లు చేస్తే.. మీతో పాటు మీ ఫ్యామిలీ, స‌మాజం కూడా ఇబ్బంది ప‌డుతుంద‌ని ఎంతో మంది వైద్యులు, ప‌రిశోధ‌కులు తెలుపుతున్నారు. ఈ స‌మ‌యంలో మ‌న దేశ ప‌రిశ్ర‌మిక దిగ్గ‌జం ఆనంద్ మ‌హీంద్ర ఒక ఆస‌క్తిక‌ర అంశాన్ని పోస్ట్ చేశారు.ఈ పోస్ట్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ప‌లువురిని ఆలోచింపజేస్తోంది.

ఆనంద్ మ‌హీంద్ర చేసిన పోస్ట్ విష‌యానికి వ‌స్తే.. మీరూ టూర్ కు ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారో ఇందులోకెళ్లి ఎంచుకోండి అంటూ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ ఇప్పుడు అందరి నోటా నానుతోంది. దాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నాక‌.. సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. సూప‌ర్ ట్విస్ట్ అంటూ క‌మెంట్లు చేస్తున్నారు.

ఆనంద్‌ మహీంద్రా సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటార‌న్న సంగ‌తి తెలిసిందే.. అయితే ఆయ‌న ఇప్పు డు చేసిన పోస్ట్ లో మీరు నెక్స్ట్ టూర్ కు ఎక్క‌డికి వెళ్లాలి అనుకుంటున్నారో సెల‌క్ట్ చేసుకోండి అని పెట్టారు. అందులో ముఖ్య‌మైన ప్రాంతాల్లో న్యూజిలాండ్‌, మెక్సికో, కెనడాతోపాటు పలు దేశాల పేర్లు ఉన్నాయి. పక్కనే ఒక పజిల్‌ను ఉంచి దాన్ని సాల్వ్ చేసిన‌క వ‌చ్చే సంఖ్య ప‌క్క‌న ఉన్న ప్లేసుకు వెళ్ల‌మ‌ని సూచించాడు. ఆస‌క్తి క‌న‌బ‌రిచిన నెటిజ‌న్లు ఆ ప‌జిల్ ను సాల్వ్ చేశారు. కానీ ప్ర‌తి ఒక్క‌రికి ఒక‌టే స‌మాధానం రావ‌డంతో అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది. 9వ నెంబ‌ర్ లో ఉన్న ఇంట్లోనే ఉండండి అనే స‌మాధానం అంద‌రికి వ‌స్తోంది. ఇంట్లోనే ఉండండి అంటే ఎవ‌రు విన‌డంలేద‌ని.. ఇలా కొత్గగా చెప్పిన ఆనంద్ మ‌హీంద్రా అంద‌రిని ఆలోచించేలా చేస్తున్నార‌ని ప‌లువురు ప్ర‌సంశిస్తున్నారు.