Anandaiah medicine: అనందయ్య ముందు ఆన్లైన్లో అమ్మకం… ఇదంతా అబద్ధం..!

Anandaiah medicine online distribution fake news
Share

Anandaiah medicine:  నెల్లూరు జిల్లా కృష్ణపట్నం నికి చెందిన ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య మందు రాష్ట్రంలో ఎంతటి సంచలనం సృష్టించిందో అందిరికి తెలిసిందే. దీనిపై అనేక రకాల టెస్టులు జరిపిన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, అలాగే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రజలు ఈ మందును వాడవచ్చు అని అనుమతులు ఇచ్చాయి. ఒక్క కంటి మందుని మినహాయించి ఆనందయ్య తయారు చేసే మిగిలిన మందులకు కావాల్సిన అనుమతులు వచ్చేశాయి.

 

Anandaiah medicine online distribution fake news
Anandaiah medicine online distribution fake news

దీంతో సోమవారం నుండి ఆనందం ముందు ఆన్లైన్లో దొరుకుతుంది అన్న వార్తలు జోరుగా బయటకు వచ్చాయి. కొరియర్ ద్వారా ప్రజలంతా చేసుకుని పొందవచ్చని లైన్లో నిలబడాల్సిన అవసరం లేదని చెప్పారు. అయితే ఇందుకు అవసరమైన website విషయానికి వస్టే ‘chilldeal.in’ అనే వెబ్సైట్ ద్వారా ఆనందయ్య మందు అందుబాటులోకి వస్తుందని ఖచ్చితమైన వార్తలు వచ్చాయి.

ఇదే విషయాన్ని ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ కూడా ప్రస్తావించింది. అయితే ఇప్పుడు అఫీషియల్ గా వచ్చిన వార్త ప్రకారం ఈ వెబ్సైట్ ఫేక్ అని తేలింది. ఇప్పటివరకు ఆనందయ్య మందు పంపిణీ ఎలాంటి వెబ్సైట్ రిజిస్టర్ చేసుకోలేదు… అని భవిష్యత్తులో అఫీషియల్ వెబ్ సైట్ ను తెలియజేస్తామని ప్రభుత్వం స్పందించింది. కాబట్టి దొంగ వెబ్ సైట్ లను నమ్మి మోసపోవద్దని చెప్పారు.

ఈ క్రమంలో ఆనందయ్య మందు పంపిణీ కూడా సోమవారం కంటే లేట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నట్లు కనిపిస్తోంది. ఆనందయ్య మందుకు డిమాండ్ చాలా ఉంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల ప్రజలు ఈ మందు కోసం కాచుకుని ఉన్నారు. అయితే సైంటిస్టులు, వైద్యులు మాత్రం ఆనందయ్య మందు తో పాటు అల్లోపతి మందులు కూడా వాడాలి అని… కేవలం ఆనందయ్య మందు పైన ఆధారపడితే ఎటువంటి ఫలితం ఉండదని అంటున్నారు. మరి ఏమవుతుందో చూడాలి.


Share

Related posts

క్రాక్ రిలీజ్ కి ముందే పెద్ద షాక్…! ఈ షో లు అన్నీ క్యాన్సిల్…

arun kanna

సుప్రీం కోర్టు సాక్షిగా నరేంద్ర మోడీ కి పెద్ద దెబ్బ !!

sridhar

Vakeel Saab : ‘జాగ్తత్త గా తీయి’ – దర్శకుడు వేణు శ్రీరామ్ కి పవన్ హెచ్చరిక

siddhu