Ananya nagalla : అనన్య నాగళ్ళ వకీల్ సాబ్ సినిమాలో ముగ్గురు అమ్మాయిల్లో ఒకరిగా కీలక పాత్ర పోషించింది. నివేథా థామస్, అంజలి లతో పోటీ పడి నటించిన అనన్య ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. పవర్ స్టార్ రీ ఎంట్రీ సినిమాగా వచ్చిన వకీల్ సాబ్ సినిమా దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులతో పాటు ప్రతీ ఒక్కరినీ ఎంతగానో ఆకట్టుకుంది. పవర్ స్టార్ స్టామినాకి సరిపోయే సినిమాగా దర్శకుడు వేణు శ్రీరాం ఈ సినిమాని తెరకెక్కించాడు. బాలీవుడ్, కోలీవుడ్ లో వచ్చిన కథ అయినా కూడా మన తెలుగు ప్రేక్షకులు నచ్చేలా .. పవర్ స్టార్ ఇమేజ్‌కి తగ్గట్టుగా కథలో చేసిన మార్పులు అద్భుతంగా చేశారు.
ముఖ్యంగా ముగ్గురు అమ్మాయిల చుట్టూ తిరిగే కథ పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి ఒప్పుకోవడం గొప్ప విషయం. మంచి సోషల్ మెసేజ్ తో ఉన్న కథ.. ఆకథ పవన్ కళ్యాణ్ ద్వారా అయితేనే ప్రేక్షకులకు బాగా రీచవుతుందన్న మేకర్స్ ఆలోచన..పవన్ కళ్యాణ్ ఆలోచన కరెక్ట్‌గా వర్కౌట్ అయ్యాయి. అందరూ మాట్లాడుకుంటుంది కోర్ట్ సన్నివేశాల గురించే. సెకండాఫ్ లో వచ్చే ఈ కోర్ట్ సన్నివేశాలు ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకోవడమే కాకుండా సుప్రీం కోర్ట్ కూడా ప్రశంసించేలా ఉండటం గొప్ప విషయం. ఇందులో పవన్ కళ్యాణ్ – ప్రకాష్ రాజ్ ల మధ్య సన్నీవేశాలు అద్భుతంగా వచ్చాయి.
Ananya nagalla : అనన్య నాగళ్ళకి టాలీవుడ్ లో మంచి పేరు వచ్చింది.
ఇక కీలకమైన పాత్రల్లో నటించిన ముగ్గురు అమ్మాయిలు ఇండస్ట్రీ ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ క్రమంలో అనన్య నాగళ్ళకి టాలీవుడ్ లో మంచి పేరు వచ్చింది. వరసగా క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయట. ఇక వకీల్ సాబ్ సక్సస్ తో అనన్య కూడా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటోంది. కాగా అనన్య మల్లేశం సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి అడుగు పెట్టింది. ఈ సినిమాలోని తన పర్ఫార్మెన్స్ చూస్తే వకీల్ సాబ్ చిత్ర బృందం ముగ్గురు అమ్మాయిలల్లో ఒక పాత్రకి ఎంపిక చేసుకున్నారు.