Anasuya : అనసూయ ..రంగమత్త గా ఎంతటి క్రేజ్ ని సంపాదినంచుకుందో అందరికీ తెలిసిందే. అంతకముందు ఏసీపి జయగా క్షణం సినిమాలో తన సహజమైన నటన తో వెండితెర మీద ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. బుల్లితెరను ఏలుతు అందంతోపాటు అద్బుతమైన టాలెంట్ తో టెలివిజన్ స్క్రీన్
పై తనదైన శైలిలో అందరి మనసులో స్థానాన్ని సంపాదించుకుంది. అనసూయ పర్ఫార్మెన్స్ కి ఫిదా అయిన దర్శక్లు తమ సినిమాలో ఈ హాట్ బ్యూటీ కోసం వైవిధ్యమైన పాత్రలను సృష్టించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అనసుయ టాలెంట్ ఒక్క టాలీవుడ్ లోనే కాదు ఇతర సినిమా ఇండస్ట్రీలలో కూడా
వినిపిస్తోంది.
కెరీర్ ప్రారంభం నుంచి మంచి పాత్రలతో మెప్పించడానికే ట్రై చేస్తోంది. రంగస్థలం తర్వాత వరుసగా ఏదో ఒక చిత్రం కమిట్ అవుతూనే ఉంది. క్షణం చిత్రంతోఅందరి దృష్టినీ ఆకర్షించి ఆ తర్వాత ‘కథనం’ చిత్రంతో ఫుల్ లెంగ్త్ రోల్ లో నటించి మెప్పించింది. క్రేజీ స్టార్ గా మారిన అనసుయా ఇప్పుడు సోషల్
మీడియలో కూడా చాలా ఆక్టివ్ గా ఉంటూ తన పై ఫోకస్ పడేల చేసుకుంటుంది. హాట్ ఫొటోస్ మీడియాలో షేర్ చేస్తూ చాలా రకాలుగా ఫ్యాన్స్ నిపెంచుకుంటోంది. ఇక అనసూయ సినిమాల లిస్ట్ కూడా బాగానే పెరుగుతోంది. అనసూయ ఒకటీ రెండు కాదు 2022 నాటికి చాలా సినిమాల్లోనటించనుంది. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న ‘రంగ మార్తాండ’లో ఓ ఎమోషనల్ క్యారెక్టర్లో నటించబోతోందని తెలిసిందే. రవితేజ అప్ కమింగ్మూవీ ఖిలాడి సినిమాలో అద్భుతమైన పాత్ర పోషిస్తోంది.
Anasuya : అనసూయ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలలో నటించే అవకాశం ఉందా..?
అలాగే థాంక్స్ బ్రదర్ సినిమాలో నటించబోతోంది. ఇక ‘ది చేజ్’ అనే కోలీవుడ్ సినిమాలో స్టార్ విజయ్ సేతుపతితో .. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న
‘పుష్ప’లో నటించబోతోంది. ఈ విధంగా వరుస ఆఫర్లతో దూసుకెళ్తోంది ఈ హాట్ బ్యూటీ. ఇలా పలు సినిమాల్లో తన వెర్సటైల్ యాక్టింగ్ తో ప్రేక్షకులను
అలరించబోతోందట అనసూయ. ప్రస్తుతం అనసూయ కి ఉన్న క్రేజ్ చూస్తుంటే రానున్న రోజుల్లో ఖచ్చితంగా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలలో నటించే
అవకాశం కూడా ఉందని చెప్పుకుంటున్నారు. అందుకు కారణం అనసూయ కోసం ప్రత్యేకంగా క్యారెక్టర్స్ తయారవుతుండటమే.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?