ప్రముఖ యాంకర్ మరియు సినీ నటి అయిన అనసూయ భరద్వాజ్ కు రెండు తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు ఉన్నారు. రంగస్థలం సినిమా లో ‘రంగమ్మత్త’ గా పేరొందిన ఈమె కథానాయికగా కూడా ‘కథనం’ సినిమాలో మెప్పించింది ఇకపోతే చాలా సినిమాల్లో ఇప్పటికే అనేక ప్రముఖ పాత్రలు పోషించిన ఈమె తన వయసులో ఉన్న ఆడవారందరికీ రోల్ మోడల్ అనే చెప్పాలి.
మూడు పదుల వయసు దాటినా అందరినీ ఆకర్షించే శరీరాకృతిని మెయింటెన్ చేయడం అనసూయ స్పెషాలిటీ. ఇదిలా ఉండగా తాను అంత అందంగా మరియు ఫిట్‌గా ఉండేందుకు కారణం యోగా మరియు వర్కవుట్లు అని అనసూయ ఎప్పుడూ చెబుతూ ఉంటుంది. ఒంపు సొంపుల వయ్యారాలతో కుర్రకారుకి కైపెక్కించే అనసూయ.. యోగా, వ్యాయామం మాత్రమే కాకుండా డైట్‌ని కూడా పక్కాగా ఫాలో అవుతూ ఉంటుంది.
తాజాగా తను యోగ చేస్తున్న వీడియో ని అనసూయ విడుదల చేసింది. పొట్టతగ్గడం కోసం చేసే యోగాసనం వేసి.. ఆ వీడియోను తన ఫేస్ బుక్ స్టోరీలో షేర్ చేసింది. అందులో ఒక పొట్టి షర్ట్ మరియు షార్ట్ వేసుకున్న అనసూయ పద్మాసనం వేసి ఊపిరి పీలుస్తూ వదులుతూ మధ్యమధ్యలో తన బెల్లీ (పొట్ట భాగం) లోని కండరాలకు అవసరమైన వ్యాయామాన్ని అందిస్తూ శారీరకంగా మరియు మానసికంగా బలంగా ఎలా ఉండాలో అందరికీ చూపించింది.
ఎటువంటి సమయంలో అయినా వర్కౌట్ మిస్ కాకూడదు అన్నట్లు ‘no excuses’ అని ఒక క్యాప్షన్ కూడా పెట్టింది. ప్రస్తుతం ఈ వీడియో చూసి మధ్య వయస్కులైన మహిళలు అనసూయ అందం వెనుక రహస్యం ఇదా అని ఆశ్చర్యపోతుంటే కుర్రకారు మాత్రం వెర్రెత్తిపోతున్నారు.