టెలివిజన్ రంగంలో యాంకర్ గా సక్సెస్ ఫుల్ గా రాణిస్తున్న అనసూయ మరోపక్క సినిమా రంగంలో కూడా వరుస ఆఫర్లు దక్కించుకుంటుంది. గతంలో కింగ్ నాగార్జున నటించిన సోగ్గాడు చిన్ని నాయన సినిమా లో మరదలు పాత్ర చేసి ప్రేక్షకులను అలరించిన అనసూయ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రంగస్థలం లో “రంగమ్మత్త” పాత్ర లో అదరగొట్టింది.
ఆ పాత్రకి అనసూయకి మంచి పేరు తీసుకొచ్చింది. ఇదిలా ఉండగా తాజాగా మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న ఆచార్య సినిమాలో కూడా అనసూయ నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు తాజాగా డైరెక్టర్ కృష్ణ వంశీ చిత్రం ‘రంగమార్తాండ’లో కూడా ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. అదేవిధంగా మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న ‘ఖిలాడీ’లో కూడా ఓ కీలక క్యారెక్టర్ అనసూయ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
డైరెక్టర్ రమేష్ వర్మ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవల రిలీజ్ కావటంతో మంచి రెస్పాన్స్ లభించింది. కాగా సినిమాలో అనసూయ పాత్ర కామెడీ తరహాలో ఉంటుందని అంతమాత్రమే కాకుండా స్పెషల్ సాంగ్లో కూడా రవితేజతో స్టెప్పులు వేయడం గ్యారెంటీ అనే టాక్ ఇండస్ట్రీలో వస్తుంది. ఈ విధంగా పాండమిక్ తర్వాత వరుస ఆఫర్లు దక్కించుకుంటూ అనసూయ ఫుల్ బిజీ గా మారిపోయింది. మరోపక్క టెలివిజన్ రంగంలో కూడా జబర్దస్త్ షో మాత్రమే కాకుండా ఇతర కార్యక్రమాలకు కూడా యాంకర్ గా వ్యవహరిస్తూ రాణిస్తోంది.