21.2 C
Hyderabad
December 8, 2022
NewsOrbit
న్యూస్ సినిమా

యాంకర్ అనసూయకు అలా జరగకుండా ఉండాల్సింది… ఘోర అవమానం ఇది!

Share

యాంకర్ అనసూయ గురించి తెలుగు వారికి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఓ వైపు బుల్లితెర, మరోవైపు వెండితెర అనే భేదం లేకుండా తన హవాను కొనసాగిస్తున్న అతి కొద్ది మందిలో యాంకర్ అనసూయ ఒకరు. జబర్దస్త్ షో ద్వారా అమ్మడు జబర్దస్త్ గా పాపులర్ అయ్యింది. కట్ చేస్తే, డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన రంగస్థలం సినిమాలో రంగమ్మ అత్త పాత్రలో ఇరగదీసింది. దాంతో అమ్మడు తిరిగి వెనక్కి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. అక్కడినుండి ఈమెని వరుస సినిమా అవకాశాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయంటే నమ్మి తీరాల్సిందే.

Anasuya

ఈ క్రమంలో తెలుగు సినిమాలే కాకుండా తమిళ్‌, మలయాళ సినిమాలలో కూడా నటిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే ఈ బొద్దుగుమ్మకి వున్న మరో అలవాటు సోషల్ మీడియాలో అటెన్షన్ పే చేయడం. అవును, ఎప్పటికప్పుడు తన సినిమాల గురించి సోషల్ మీడియా వేదిక ద్వారా అభిమానులతో పంచుకోవడం ఈమెకి అలవాటు. ఇక ఎక్కడన్నా బయటకి వెళ్ళినపుడు అందుకు సంబందించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వస్తుంది. ఈ క్రమంలోనే ఓ వార్త నెట్టింట చక్కర్లు కోడుతుంది.

తాజాగా అనసూయ ఫ్యామిలీకి బెంగళూరు విమానాశ్రయంలో ఓ చేదు అనుభవం ఎదురైంది. బెంగళూరు నుండి తిరిగి హైదరాబాద్ కి వచ్చేందుకు అలియన్స్ విమానాయ సంస్థలో ఫ్లైట్ టికెట్స్ ని బుక్ చేసుకున్నారు. టిక్కెట్లు పై 6:55 నిలకు అని ఉండగా, 6:10 గంటలకే ఫ్లైట్ అంటూ తమని ఎయిర్‌పోర్టు సిబ్బంది పరిగెత్తించినట్లు సదరు పోస్టులో వాపోయింది. అంతేకాకుండా ఎయిర్ పోర్ట్ కి చేరుకోగానే ఫ్లైట్ అరగంట సేపు లేటుగా వచ్చిందట. ఆ తర్వాత కూడా మాస్కులు లేనిదే విమానంలోనికి అనుమతించడం జరగదని విమాన సిబ్బంది చెప్పారని, ఇంకా వారికి సంబంధిత సీట్లలో కాకుండా వేరువేరు సీట్లలో కూర్చోబెట్టారని.. ఇంత అవమానం ఎప్పుడు జరగలేదని వాపోయింది.


Share

Related posts

EAMCET and ECET: ఎంసెట్,ఈసెట్ షెడ్యుల్ ప్రకటించిన తెలంగాణ ఉన్నత విద్యాశాఖ..

somaraju sharma

Corona Cases : దేశంలో కొనసాగుతున్న కరోనా విజృంభణ …రికార్డు స్థాయిలో 3లక్షల దాటిన కేసులు

somaraju sharma

విశ్వ‌క్ సేన్ `కార్టూన్‌`

Siva Prasad