20.7 C
Hyderabad
December 7, 2022
NewsOrbit
న్యూస్ సినిమా

Anchor Anasuya: స్టార్ యాంకర్ అనసూయ కథ ముగిసినట్లేనా.. ఎందుకీ గప్‌చుప్.. 

Share

Anchor Anasuya: యాంకర్ అనసూయ ఇదివరకు జబర్దస్త్ షో ద్వారా ప్రతి గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చేది. కానీ ఇప్పుడు ఆ షో మానేసిన తరువాత ఎప్పుడో అమావాస్యకో, పున్నమికో ఒకసారి కనిపిస్తుంది. గాడ్ ఫాదర్ సినిమాలో ఒక ఛానెల్‌కి ఓనర్‌గా కనిపించిన అనసూయకి ఆ పాత్ర వాళ్ల పెద్దగా ఒరిగిందేమి లేదు. ఈమధ్య కాస్త బరువు పెరగటం కూడా అనసూయకి బుల్లి, వెండి తెర అవకాశాలు రావడంలేదని తెలుస్తోంది.

Anchor Anasuya: పని అయిపోయినట్టేనా

Anchor Anasuya
Anchor Anasuya

జబర్దస్త్ షో ద్వారా ప్రతివారం ప్రేక్షకులను అలరించే అనసూయ గురువారం రాగానే గ్లామర్‌గా రెడీ అయ్యి ఫొటోషూట్ చేసుకొని వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అందరినీ అలరించేది. ఇప్పుడు సినిమాలో చిన్న పాత్రలలో నటిస్తూ ఫ్యాన్స్‌ని సాటిస్ఫై చేస్తోంది. మొన్నీ మధ్య వచ్చిన పుష్ప తప్ప మిగతా సినిమాలు ఏవి కూడా ఆమెకు గుర్తింపు తేలేదు. రంగమార్తాండ మూవీలో ఆమెకు ఓ చిన్న రోల్ దొరికింది. ఇక ప్రస్తుతం ఈ హాట్ యాంకర్ సినిమాల్లో చిన్నాచితకా పాత్రలలో తప్ప సోషల్ మీడియాలలో అంత యాక్టివ్‌గా ఉండటం లేదు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కాంట్రవర్సీలతో హడావిడి చేసే అనసూయ ఇప్పుడు తన భర్తతో కలిసి దిగిన ఫొటోలను షేర్ చేస్తుంది.

అక్కడే మిస్టేక్ చేసిందా

ప్రస్తుతం అనసూయ క్రేజ్ అన్ని ఛానల్స్‌లో తగ్గటానికి చాలా కారణాలే ఉన్నాయి. కానీ కొంతమంది మాత్రం జబర్దస్త్ నుంచి తప్పుకోవడం వల్లనే అనసూయ క్రేజ్ తగడానికి ముఖ్య కారణంగా చూపిస్తున్నారు. జబర్దస్త్ ని వదిలేసిన తరువాత స్టార్ మా ఛానల్లో ప్రసారమయ్యే సూపర్ సింగర్ షో కి హోస్ట్ గా చేసింది. ఇక ఆ షో కూడా పూర్తయిన తరువాత అనసూయ ఇంకే ఛానెల్‌లో కనిపించలేదు. ఇటీవల జరిగిన గాడ్ ఫాదర్ ప్రమోషన్స్‌కి కూడా ఈ అమ్మడు రాలేదు.


Share

Related posts

Ys Jagan : తెల్లారితే ఎలక్షన్ – ఆ 31మందీ టీడీపీ కి రాజీనామా ? జగన్ ఫస్ట్ బాల్ కే సిక్సర్ కొట్టాడు ??

sekhar

తమన్నాని వెంటాడుతున్న “ఆ కల” ..?

GRK

Sonam kapoor : సోనం కపూర్ తెలుగులో అవకాశాలు అందుకుంటుందా..?

GRK