Anasuya: బుల్లితెరపై యాంకర్ గా ఎంటర్టైన్మెంట్ రంగంలో అడుగు పెట్టిన అనసూయ చాలా తక్కువ టైంలో సూపర్ క్రేజ్ సంపాదించింది. ముఖ్యంగా జబర్దస్త్ షోలో అనసూయ వేసే యాంకరింగ్ దుస్తులు చాలా ఆకట్టుకునే విధంగా ఉండటంతో .. ఆమెకు క్రేజ్ ఉన్న కొద్ది పెరుగుతూ భీభత్సమైన ఫాలోయింగ్ ఏర్పరచుకుంది. సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ ఫోటో లేదా వీడియో పెట్టిన చాలు లైక్ ల మీద లైకులు కామెంట్లు వస్తాయి. అటువంటి అనసూయ సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టి వరుస అవకాశాలు ప్రస్తుతం దక్కించుకుంటున్నారు.
ఒక తెలుగులో మాత్రమే కాకుండా సౌత్ ఇండస్ట్రీలో అనేక భాషలలో అవకాశాలు అందుకుంటూ ఉంది. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సినిమాతో పాటు బోయపాటి దర్శకత్వంలో బాలయ్య బాబు నటిస్తున్న “అఖండ” సినిమాలో ఛాన్స్ అందుకోవడం జరిగిందట. ముఖ్యంగా “రంగస్థలం” సినిమాలో రంగమ్మత్త పాత్రలో అనసూయ చేయటంతో హైలెట్ అవ్వటంతో పుష్పలో ఎటువంటి క్యారెక్టర్ చేస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది.
Read More: Pushpa : పుష్పలో లవర్ బాయ్..పార్ట్ 1 లోనా 2లోనా..?
ఇదిలా ఉంటే తాను సినిమాలు సెలెక్ట్ చేసుకునే విధానం గురించి ఇటీవల తన మనసులో మాటను బయటపెట్టింది. మేటర్ లోకి వెళ్తే ఆడియన్స్ ఎంటర్టైన్ చేసే సబ్జెక్టు ఉంటే కచ్చితంగా ఒప్పుకోవడం జరుగుతుందని, గ్లామర్ ఉండే రీతిలో తన పాత్ర ఉంటేనే చేస్తాను అనే రకం కాదని స్పష్టం చేసింది. తెరమీద తన పాత్ర చూసినప్పుడు.. చూసే ప్రేక్షకులు కచ్చితంగా సర్ప్రైజ్ అవ్వాలి బోర్ గా ఫీల్ అవ్వకూడదు.. అటువంటి క్యారెక్టర్లు ఉంటే కచ్చితంగా సినిమా చేయడం జరుగుతుందని అనసూయ తన సినిమాకి సెలక్షన్ గురించి సరి కొత్త విషయాన్ని బయట పెట్టింది.