Bigg boss Lasya : బిగ్ బాస్ లాస్య గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తను యాంకర్ లాస్య స్థానం నుంచి బిగ్ బాస్ లాస్యగా గుర్తింపు పొందింది. తన సినీ కెరీర్ ను యాంకర్ గా ప్రారంభించిన లాస్య…. అతి తక్కువ సమయంలోనే టాప్ యాంకర్ గా నిలిచింది. అప్పట్లో తెలుగులో యాంకర్ పేరు చెబితే లాస్య పేరు గుర్తొచ్చేది. అంతలా లాస్య… యాంకరింగ్ లో పేరు ప్రఖ్యాతలు సంపాదించింది.

అయితే… తన పెళ్లి తర్వాత లాస్య… తన యాంకరింగ్ కెరీర్ కు బ్రేక్ ఇచ్చింది. జున్ను పుట్టిన తర్వాత ఓ సంవత్సరానికి మళ్లీ తన కెరీర్ ను స్టార్ట్ చేసింది. అప్పుడే తనకు బిగ్ బాస్ లో అవకాశం వచ్చింది. దీంతో తన రేంజే మారిపోయింది. బిగ్ బాస్ తర్వాత తనకు ఆఫర్లు కూడా చాలా వస్తున్నాయి. తను ఇప్పుడు పెద్ద సెలబ్రిటీ. టీవీ షోలలోనూ తనకు చాలా ఆఫర్లు వస్తున్నాయి.
Anchor Lasya : జున్ను బర్త్ డే వేడుకల్లో మెరిసిన బిగ్ బాస్ కంటెస్టెంట్లు
తాజాగా లాస్య కొడుకు జున్ను బర్త్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. తన కొడుకు బర్త్ డే వేడుకలకు… బిగ్ బాస్ 4 కంటెస్టెంట్లతో పాటు.. మరికొందరు సెలబ్రిటీలను పిలిచింది లాస్య. అయితే… జున్ను బర్త్ డే వేడుకల్లో ఎక్కువగా హైలెట్ అయింది మాత్రం మోనల్ గజ్జర్, అఖిల్ సార్థక్ జంట. ఇద్దరూ కలిసి వచ్చి జున్నును ఆశీర్వదించారు. అందరి కళ్లు కూడా అక్కడ వీళ్లిద్దరి మీదనే పడ్డాయి.
బిగ్ బాస్ హౌస్ లో ఉన్నంత కాలం… ఇద్దరూ తెగ ప్రేమించుకున్నారు. ఇప్పుడు వీళ్ల మధ్య అసలు ప్రేమ ఉందా? లేదా? అనే డౌట్ ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులకు కలుగుతోంది. ఏమో వాళ్లిద్దరి మధ్య ఏముందో తెలియాలంటే… ఇంకా కొన్ని రోజులు ఆగాల్సిందే.