21.7 C
Hyderabad
December 2, 2022
NewOrbit
న్యూస్ సినిమా

Anchor Neha: నాగార్జునపై సంచలన కామెంట్స్ చేసిన నేహా చౌదరి.. ఏమన్నదంటే..

Share

Anchor Neha: బిగ్‌బాస్ సీజన్ 6 చాలా రసవత్తరంగా కొనసాగుతోంది. ఈసారి ఇందులో యాంకర్ నేహా చౌదరి ఒక కంటెస్టెంట్‌గా పార్టిసిపేట్ చేసింది. ఈ ముద్దుగుమ్మ చివరివరకు ఉంటుందనుకుంటే మూడో వారంలోనే ఎలిమినేట్ అయ్యింది. దాంతో ఆమె ఫ్యాన్స్ భారీ షాక్‌కి గురయ్యారు. కేవలం ఆడియన్స్ మాత్రమే కాదు నేహా చౌదరి కూడా తన ఎవిక్షన్ ఊహించలేదు. అందుకే ఆమె కూడా చాలా డిసప్పాయింట్ అయింది. నేహా చౌదరి హౌజ్‌లో ఉన్నంతసేపు చాలా చురుగ్గా ఉంది. టాస్క్‌లలో బాగా పర్ఫార్మ్‌ చేసింది. ఈ సమయంలో దెబ్బలు కూడా తగ్గించుకుంది. ఆమె 100% ఇచ్చింది. అందరితో చక్కగా మాట్లాడుతూ ప్రతి ఎపిసోడ్‌లో తన ప్రెసెన్స్ ఎక్కువగా ఉండేలా చూసుకుంది.

Anchor Neha: అలాంటోళ్లు చాలామందే ఉన్నారు

Anchor Neha
Anchor Neha

అయితే ఆమె చేసిన కొన్ని తప్పులు వల్ల జనాలు ఎక్కువగా ఓటు వేయలేదు. అలా ప్రజాతీర్పుకు ఆమె బలి అయ్యింది. అయితే ఇటీవల తన ఎలిమినేషన్ పై స్నేహ సంచలన వ్యాఖ్యలు చేసింది. తనకన్నా వరస్ట్‌గా టాస్క్ ఆడినవాళ్లు, అసలు ఫ్రేమ్‌లో కనిపించనవారు ఇంకా హౌజ్‌లో ఉన్నారని.. తాను ఎంత మంచిగా ఆడినా కూడా పంపించేశారని.. ఇంట్లో ఉండాల్సిన అర్హత లేని వారు చాలా మంది ఉన్నారని.. వారి పేర్లను ఇప్పుడు చెప్పలేను అని నేహా సంచలన కామెంట్ చేసింది. వాసంతి గేమ్ ఆడదు, ఎవరితోనూ మాట్లాడదు. కేవలం గ్లామర్‌గా డ్రెస్ చేసుకుంటుంది. అందుకే ఆ అమ్మాయి ఇంకా హౌజ్‌లోనే ఉందంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరినీ నోరెళ్ళబెట్టేలా చేస్తున్నాయి.

నాగార్జునను కూడా వదిలిపెట్టలేదు

Anchor Neha
Anchor Neha 

హోస్ట్ నాగార్జునపై కూడా నేహా చౌదరి షాకింగ్ కామెంట్స్ చేసింది. నేహా మాట్లాడుతూ “నేను ఇనాయ విషయంలో తప్పు చేయలేదని హౌస్‌మేట్స్ అందరూ కూడా ఒకటే మాట మాట్లాడారు. దాన్నిబట్టి నేను తప్పు చేశానో లేదో నాకు తెలిసింది. కానీ ఆ విషయం నాగార్జునకి తెలియలేదు. అందుకే ఆమె విషయంలో నేను తప్పు చేశానంటూ వేలెత్తి చూపించారు. అసలా ఎపిసోడ్‌లో నన్ను హైలెట్ చేసిందే లేదు. దీన్ని బట్టి నాకు ఏం అర్థమైంది అంటే.. నన్ను ముందుగానే ఎలిమినేట్ చెయ్యాలని బీబీ టీమ్ నిర్ణయించింది. నాగార్జున హౌస్‌మేట్స్‌లో కొందరికి ఫెవర్ చేస్తున్నారా లేదా అనే విషయంపై నేనేం మాట్లాడదలుచుకోలేదు. కానీ నాకు మాత్రం ఆయన డిప్లమేటిక్ ఆన్సర్స్ ఇవ్వలేదు అనేది ముమ్మాటికీ నిజం.” అంటూ ఆమె నాగ్‌పై కూడా ఫైర్ అయ్యింది. ఇదిలా ఉండగా హౌస్ లో ఉన్నన్ని రోజులు ఈ యాంకర్ వారానికి రూ.40 వేల చొప్పున రెమ్యునరేషన్ పుచ్చుకుందని సమాచారం.


Share

Related posts

OTT: OTTలు వాటిపై ఎందుకంత ఇంటరెస్ట్ చుపిస్తున్నాయంటే? అసలు కారణం ఇదే!

Ram

Liger – JGM: పూరితో జర్నీ విజయ్‌కు సేఫేనా..?

GRK

మీడియా పై సీరియస్ అయిన బాలయ్య బాబు..!!

sekhar