ట్రెండింగ్ న్యూస్

Ohmkar : ముమైత్ ఖాన్ తో మూడు చెరువుల నీళ్లు తాగించిన ఓంకార్ అన్నయ్య?

anchor ohmkar serious on mumaith khan in dancee plus show
Share

Ohmkar : యాంకర్ ఓంకార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన రూటే సపరేట్. అందరు యాంకర్లు ఒక విధంగా ఉంటే.. ఈయన ఇంకో విధంగా ఉంటారు. మొత్తం మీద యాంకర్ ఓంకార్ అంటే తెలుగు బుల్లితెర మీద ఉన్న పాపులారిటే వేరు. అది యాంకర్ ఓంకార్ రేంజ్.

anchor ohmkar serious on mumaith khan in dancee plus show
anchor ohmkar serious on mumaith khan in dancee plus show

ఒకప్పుడు ఆట ప్రోగ్రామ్ తో తెలుగు బుల్లితెరకు పరిచయం అయిన ఓంకార్ ఆ తర్వాత మాయాద్వీపం, ఆట జూనియర్స్, సిక్స్త్ సెన్స్ లాంటి ప్రోగ్రామ్ లతో తెగ ఫేమస్ అయిపోయాడు. తాజాగా స్టార్ మాలో డ్యాన్స్ ప్లస్ షోలో హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు యాంకర్ ఓంకార్.

Ohmkar : జడ్జిమెంట్ విషయంలో ముమైత్ ఖాన్ తో విభేదించిన ఓంకార్

సాధారణంగా ఓంకార్ ఏ షోలో ఉంటే ఆ షోలో వివాదాలు ఎక్కువగా ఉంటాయి. కావాలని వివాదాలను సృష్టిస్తారో లేక అవి వస్తాయో తెలియదు కానీ.. ఓంకార్ మాత్రం చాలా ముక్కుసూటిగా ఉంటారు. ఏ విషయమైనా సరే.. వాళ్లు ఎవరైనా సరే.. స్టేజ్ మీదనే అడిగి కడిగేస్తుంటాడు.

తాజాగా జడ్జిమెంట్ విషయంలో కూడా అంతే. ఓంకార్ డైరెక్ట్ గా ముమైత్ ఖాన్ తో గొడవ పెట్టేసుకున్నాడు. చిన్న పిల్లల డ్యాన్స్ గ్రూప్ చేసిన పర్ ఫార్మెన్స్ నచ్చక ముమైత్ ఖాన్ రెడ్ ఇచ్చింది. ఆ తర్వాత చేసిన వాళ్లకు గ్రీన్ ఇచ్చింది. ముందు చేసిన చిన్న పిల్లలు కొంచెం తప్పు చేశారని అందుకే రెడ్ ఇచ్చానని చెప్పింది. ఆ తర్వాత చేసిన వాళ్లు కూడా కొన్ని తప్పులు చేశారని.. అయినప్పటికీ గ్రీన్ ఇస్తున్నానని చెప్పి పప్పులో కాలేసింది.

వెంటనే ఓంకార్.. చిన్ని పిల్లలు తప్పు చేశారని వాళ్లకు రెడ్ ఇచ్చావు.. వేరే కంటెస్టెంట్లు తప్పు చేసినా వాళ్లకు గ్రీన్ ఇచ్చావు. చిన్న పిల్లలు స్టేజ్ మీదికి వచ్చి డ్యాన్స్ చేయడమే గొప్ప. అంత మాత్రానికి వాళ్లకు రెడ్ ఇచ్చి.. బాగా పర్ ఫామ్ చేయని వాళ్లకు గ్రీన్ ఇచ్చావు.. అంటూ ఓంకార్ అడిగేసరికి.. ముమైత్ ఖాన్ నీళ్లు మింగింది. ఏం మాట్లాడాలో తనకు అర్థం కాలేదు.

దానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. మీరు కూడా ఆ ప్రోమోపై ఓ లుక్కేయండి.


Share

Related posts

Parvati Nair Beautiful Lucks

Gallery Desk

Telangana : తెలంగాణలో అడ్వకేట్ల టైం అస్సలు బాగాలేదు !చావు అంచుకు వెళ్లి వచ్చిన మరో న్యాయవాది !!

Yandamuri

Bones: ఈ ఆహారాలు తింటే మీ ఎముకల ఆరోగ్యం అంతే సంగతులు..

bharani jella