వచ్చే వారం ఢీ 12 క్వార్టర్ ఫైనల్స్ జరగనుంది. దానికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఢీ షోలో యాంకర్ ప్రదీప్ తో పాటు సుడిగాలి సుధీర్, హైపర్ ఆది కనువిందు చేస్తారని తెలుసు కదా.
తాజాగా విడుదల చేసిన ప్రోమో చూస్తే.. సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్ కు కోపం తెప్పించే పని చేశాడు యాంకర్ ప్రదీప్. హైపర్ ఆది.. సుధీర్ ను కుర్చీలో కూర్చోబెట్టి తీసుకొస్తాడు. కళ్లద్దాలు కూడా పెట్టుకున్నాడు సుధీర్. కళ్లద్దాలు అలా తీసి ఇలా స్టయిల్ గా పెట్టుకుంటూ.. నేనెంత హాండ్ సమ్ అని అంటాడు సుధీర్.
దీంతో వెంటనే అందుకున్న ప్రదీప్.. కళ్లద్దాలు పెట్టుకునేటప్పుడు కనీసం ఒక్కసారి కూడా ఆ కళ్లద్దాలలో కనిపించే నీ ముఖాన్ని చూసుకోవా? అంటూ ప్రదీప్.. సుధీర్ కు పంచ్ వేయగానే సెట్ లో అందరూ నవ్వేస్తారు. ఇది కామెడీకే అయినా కూడా కొంచెం ఆ మాటలు సుధీర్ ను ఇబ్బంది పెట్టినట్టుగానే అనిపిస్తుంది ఆ ప్రోమో చూస్తే.