Anchor Pradeep : యాంకర్ ప్రదీప్ anchor pradeep గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రదీప్ ప్రస్తుతం తెలుగులోనే టాప్ యాంకర్. అలాగే.. ఈ మధ్య సినిమాల్లోనూ నటిస్తున్నాడు. హీరోగా ఇటీవల 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? అనే సినిమాలో నటించాడు. తర్వాత కొన్ని కొన్ని సినిమాల్లో కీలక రోల్స్ లో నటిస్తూనే.. మరోవైపు తనకు ఇష్టమైన యాంకరింగ్ ను కూడా చేస్తున్నాడు.

ఢీ షోలో డ్యాన్సులు ఒకెత్తు అయితే.. ప్రదీప్ చేసే యాంకరింగ్ మరో ఎత్తు. యాంకర్ ప్రదీప్.. కామెడీ టైమింగ్ అద్భుతంగా ఉంటుంది. జబర్దస్త్ కమెడియన్లు సుడిగాలి సుధీర్, హైపర్ ఆది కూడా యాంకర్ ప్రదీప్ ముందు దిగదుడుపే. ప్రదీప్ కామెడీ టైమింగ్ అలా ఉంటది మరి.
ఢీ షోలో కూడా యాంకర్ ప్రదీప్.. హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ తో కలిసి కామెడీని జనరేట్ చేయడం కోసం.. వాళ్లను కూడా ఓ ఆటాడుకుంటాడు.
Anchor Pradeep : దీపిక పిల్లి, యాంకర్ రష్మీలకు పంచులు వేసిన ప్రదీప్
ఢీ షోలో యాంకర్ రష్మీ, దీపిక పిల్లి.. ఇద్దరూ తమ అందాలను ఆరబోస్తుంటారు. కాసేపు ప్రేక్షకులను అలరించడం కోసం సరదాగా వీళ్లు కూడా కామెడీ చేస్తుంటారు. అయితే.. తాజా ఎపిసోడ్ లో యాంకర్ ప్రదీప్.. ఇద్దరినీ ఓ ఆట ఆడుకున్నాడు. దీపిక, రష్మీ.. ఇద్దరినీ మీరు అందంగా లేరని.. మేకప్ వేస్తేనే ఏదో అలా ఉంటారని.. మిమ్మల్ని హీరోయిన్లుగా ఎవ్వరూ ఊహించుకోరంటూ.. స్టేజ్ మీదే వాళ్లిద్దరి పరువు తీసేశాడు. దీంతో ఏం చేయాలో తెలియక బిక్క మొహం వేశారు ఇద్దరు.
దానికి సంబంధించిన తాజా ప్రోమో రిలీజ్ అయింది. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా చూసేయండి.