ట్రెండింగ్ న్యూస్

Anchor Ravi : ఇంట్లో ఇల్లాలు.. వంటింట్లో ప్రియురాలును పెట్టుకొని రవి రచ్చ చేస్తున్నాడట.. ఓంకార్ అన్నయ్య మొత్తం బయటపెట్టేశాడుగా?

Anchor Ravi ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలును పెట్టుకొని రవి రచ్చ చేస్తున్నాడట ఓంకార్ అన్నయ్య మొత్తం బయటపెట్టేశాడుగా
Share

Anchor Ravi : యాంకర్ రవి anchor ravi గురించి తెలుసు కదా. రవి ఎక్కడుంటే అక్కడ రచ్చ రంబోలానే. రవికి ఉన్న ఫాలోయింగ్ కూడా అటువంటిది. తెలుగు బుల్లితెర మీద టాప్ మేల్ యాంకర్లలో రవి ఒకరు. యాంకర్ రవి చాలా సింపుల్ గా ఉండటమే కాకుండా.. టైమింగ్ కామెడీ చేయడంలో దిట్ట. అందుకే.. ఎక్కువ చానెళ్లలో వచ్చే ప్రోగ్రామ్స్ కు రవి యాంకర్ గా ఉన్నాడు.

Anchor Ravi : 100 Percent love part 2 latest promo
Anchor Ravi : 100 Percent love part 2 latest promo

స్టార్ మాలో 100 పర్సెంట్ లవ్ అనే ఓ స్పెషల్ ప్రోగ్రామ్ ను నిర్వహించిన విషయం తెలిసిందే. దాని పార్ట్ 1 ఇప్పటికే ప్రసారం కాగా.. పార్ట్ 2 ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు స్టార్ మాలో ప్రసారం కానుంది.

ఈ షోకు యాంకర్ గా ఓంకార్ వ్యవహరిస్తున్నాడు. ఓంకార్ గురించి తెలుసు కదా. ఆయన చూడటానికి చాలా సీరియస్ గా కనిపిస్తాడు కానీ.. చాలా జోవియల్ గా ఉంటాడు. షోకు వచ్చిన కంటెస్టంట్లకు టెన్షన్ పెట్టడంలో దిట్ట. అందుకే.. ఓంకార్ కూడా చాలా ఫేమస్ అయ్యాడు.

Anchor Ravi : 100 పర్సెంట్ లవ్ పార్ట్ 2 లేటెస్ట్ ప్రోమో అదుర్స్

అయితే.. తాజాగా విడుదలైన 100 పర్సెంట్ లవ్ పార్ట్ 2 ప్రోమోలో ఓంకార్ అన్నయ్య.. యాంకర్ రవిని ఆటపట్టిస్తాడు. రవి.. నీ లవ్ లైఫ్ ఎలా ఉంది.. అంటూ ఓంకార్ అడగడం.. లవ్ లైఫ్.. వైఫ్ తో ఉందన్నా.. అంటూ యాంకర్ రవి చెబుతాడు. దీంతో.. ఇంట్లో ఇల్లాలు.. వంటింట్లో ప్రియురాలు.. అని ఓంకార్ అనేసరికి.. నో నో నో.. ఇంట్లో ఇల్లాలు.. వంటింట్లో ప్రియురాలు ఒక్కరే.. అంటూ రవి క్లారిటీ ఇస్తాడు.

వెంటనే సెట్ లో ఉన్న కొందరు.. ప్రియురాలు వంటింట్లో ఎందుకు ఉంటది.. సెట్ లో ఉంటది అంటూ పంచ్ వేసేసరికి.. రవికి ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. మొత్తానికి ఓంకార్ కావాలని యాంకర్ రవిని ఆడుకున్నాడని అర్థం అయింది.

ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా 100 పర్సెంట్ లవ్ లేటెస్ట్ ప్రోమోను చూసేయండి.

 


Share

Related posts

ఇద్దరు విద్యార్ధినుల అదృశ్యం .. 20 బృందాలుగా పోలీసుల గాలింపు

somaraju sharma

Salaar: ఆ అంచనాలు ప్రభాస్‌కు పెద్ద మైనస్ అవుతాయా..?

GRK

ఈ కాంబినేషన్ ఆహారం మహా డేంజర్!!

Kumar