anchor ravi and his wife nitya interview
యాంకర్ రవి తెలుసు కదా. ఆయన ప్రస్తుతం తెలుగు బుల్లితెర మీద టాప్ యాంకర్. అయితే.. యాంకర్ రవి గురించి తెలిసిన విషయాలు చాలా తక్కువ. తెలుగు ప్రేక్షకులకు ఆయన పర్సనల్ విషయాలు ఎక్కువగా తెలియదు. అసలు.. యాంకర్ రవికి పెళ్లి అయింది అనే విషయం కూడా చాలామందికి తెలియదు. ఆయనది లవ్ మ్యారేజ్. తన భార్య, రవి ఇద్దరూ క్లాస్ మేట్స్. అప్పటి నుంచే వాళ్లిద్దరి మధ్య ప్రేమ ఉంది. ఆ తర్వాత ఇంట్లో వాళ్లను ఒప్పించి వాళ్లు పెళ్లి చేసుకున్నారు.
యాంకర్ రవి భార్య పేరు నిత్య. తనది హైదరాబాదే కాకపోతే ఓల్డ్ సిటీ. యాంకర్ రవి భార్య ఎక్కువగా బయట కనిపించదు. రవి కూడా ఎక్కువగా తనను తీసుకెళ్లడు. ఫ్యామిలీ లైఫ్ ను చాలా సీక్రెట్ గా ఉంచుతాడు రవి.
అయితే.. ఇటీవల న్యూ ఇయర్ సందర్భంగా ఓ న్యూస్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రవి, తన భార్య నిత్య.. ఇద్దరూ తమ పర్సనల్ విషయాలను బయటపెట్టారు. తమ ప్రేమ కథను, పెళ్లి చేసుకోవడం కోసం ఇంట్లో వాళ్లను ఒప్పించిన తీరు.. అన్నీ బుల్లి తెర ప్రేక్షకులతో పంచుకున్నారు.
యాంకర్ రవికి ఇద్దరు పిల్లలు. తన చిన్న కూతురు అంటే రవికి చాలా ఇష్టం. ఇక.. రవికి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడానికి ఎన్నో ఆఫర్స్ వచ్చినా.. తన భార్యను, పిల్లలను వదిలి వెళ్లేందుకు ఇష్టం లేక రవి బిగ్ బాస్ ఆఫర్ ను తిరస్కరించాడట.
అప్పట్లో యాంకర్ రవి, లాస్య.. ఇద్దరూ కలిసి చాలాసార్లు ఎన్నో షోలలో పాల్గొన్నప్పుడు ఇద్దరూ లవ్ లో ఉన్నారని వార్తలు వచ్చాయి. కానీ.. అప్పటికే రవికి పెళ్లయిపోయింది. నిజానికి.. రవి, లాస్య.. ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. కానీ.. బయట మాత్రం ప్రచారం వేరే విధంగా జరిగింది. తర్వాత ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అని.. లాస్య కూడా వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుందని అందరికీ తెలిసిన తర్వాత వాళ్లిద్దరి మ్యాటర్ ను అందరూ వదిలేశారు.
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ మంచి కమెడియన్గా తెలుగు ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్నాడు. సుధీర్ కమెడియన్ మాత్రమే కాదు…
Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `ఛలో`తో టాలీవుడ్లోకి అడుగు పెట్టి అనతి…
Pears: యాపిల్ పండు లాగానే కనిపించే పియర్స్ పండు చాలా రుచిగా ఉంటాయి.. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. కానీ…
Breaking: వైసీపీ (YCP) ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnam Raju) కు హైకోర్టు (AP High Court) లో…
Non Veg: వర్షాకాలం (Monsoon) మొదలవడంతోనే వాగులు వంకలు పొంగిపొర్లుతాయి.. ఈ సీజన్లో ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తుంది.. వర్షాకాలంలో…
Russia Ukraine Missile Attack: ఉక్రెయిన్ (Ukraine) పై రష్యా (Russia) దాడులను కొనసాగిస్తూనే ఉంది. రష్యా చేస్తున్న క్షిపణి…