Anchor Ravi : యాంకర్ రవి Anchor Ravi గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. ఆయనకున్న క్రేజ్ మామూల్ది కాదు. ప్రస్తుతం బుల్లితెర మీద టాప్ యాంకర్లలో ఒకరు రవి. చాలా ప్రోగ్రామ్స్ లో రవినే యాంకర్ గా తీసుకుంటున్నారు. ముఖ్యంగా శ్రీముఖి, సుమతో కోయాంకర్ గా రవినే ఎక్కువ తీసుకుంటున్నారు.
అందులోనూ రవి చాలా సరదాగా ఉంటాడు. రవి టైమింగ్ కామెడీని కూడా బాగా చేస్తాడు. అందుకే.. చాలా ప్రోగ్రామ్స్ లో రవిని తీసుకోవడానికి ఎక్కువగా ఆసక్తిని చూపిస్తున్నారు.
జీతెలుగులో ప్రసారమయ్యే బిగ్ సెలబ్రిటీ చాలెంజ్ లో యాంకర్ సుమ, యాంకర్ రవి హోస్ట్ లుగా ఉన్నారు. బిగ్ సెలబ్రిటీ చాలెంజ్ అంటే తెలుసు కదా. ఆ షోకు వచ్చిన గెస్టులు.. కంటెస్టెంట్లు చేసే స్టంట్ల మీద చాలెంజ్ విసరాల్సి ఉంటుంది.
బిగ్ సెలబ్రిటీ చాలెంజ్ ఇదివరకు జీ తెలుగులో ప్రసారమైనా.. కొన్ని కారణాల వల్ల మధ్యలో ఆగిపోయింది. తర్వాత మళ్లీ ఇటీవలే స్టార్ట్ అయింది. బిగ్ సెలబ్రిటీ చాలెంజ్ లో తాజాగా బిగ్ బాస్ 3 కంటెస్టెంట్లు వరుణ్ సందేశ్, వితిక ఇద్దరు గెస్టులుగా వచ్చారు. వాళ్లతో యాంకర్ సుమ, రవి సందడి చేశారు.
Anchor Ravi : మరో గెస్టుగా వచ్చిన కమెడియన్ సద్దాం
వరుణ్ సందేశ్, వితికలతో పాటు.. అదిరింది కమెడియన్ సద్దాం కూడా బిగ్ సెలబ్రిటీ చాలెంజ్ కు వచ్చి సందడి చేశాడు. ఈ సందర్భంగా యాంకర్ రవితో స్పెషల్ గా నీకోసమే ఓ కథ రాశానని.. ఆ సినిమా పేరు అబ్బబ్బ.. ఆగలేను అని దానికి నువ్వే హీరో అంటూ యాంకర్ రవితో చెబుతాడు సద్దాం. దీంతో యాంకర్ రవి కూడా.. అరేయ్.. ఇవన్నీ ఇప్పుడు వద్దురా.. సపరేట్ గా కూర్చొని మాట్లాడుకుందాం. ముందైతే ఆ పేరును రిజిస్టర్ చేయించు అంటూ రివర్స్ పంచ్ ఇస్తాడు సద్దాంకు.
మొత్తం మీద బిగ్ సెలబ్రిటీ చాలెంజ్ లో అదిరిపోయే స్టంట్స్ తో పాటు.. కామెడీ కూడా బుల్లితెర ప్రేక్షకులను బాగానే అలరిస్తోంది. తాజాగా.. బిగ్ సెలబ్రిటీ చాలెంజ్ లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. మీరు కూడా ఓ లుక్కేసుకోండి.
https://www.youtube.com/watch?v=CpLbhygATJs