బాబా భాస్కర్ పై యాంకర్ రవి ఫైర్..!!

త్వరలో దసరా పండుగ వచ్చేస్తున్న నేపద్యంలో టెలివిజన్ లో సరదా సరదా కార్యక్రమాలు రెడీ అవుతున్నాయి. స్టార్ మా ఈటీవీ జీ తెలుగు ఇలా ఎవరికి వారు దసరాకి సరికొత్త కార్యక్రమాలతో టెలివిజన్ ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు. ఇదిలా ఉండగా కరోనా కారణంగా సినిమాల విడుదల ప్రస్తుతం ప్రశ్నార్ధకంగా ఉండటంతో… ఈ సమయంలో ఎలాగైనా టిఆర్పి రేటింగ్ లో భారీ స్థాయిలో దక్కించుకోవాలని షో నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారట.

దీనిలో భాగంగా స్టార్ మా జాతరో జాతర అంటూ ఓ స్పెషల్ ప్రోగ్రాం ని చేయడం కోసం ఏకంగా వంటలక్క ను రంగంలోకి దింపుతున్నారు అట. కార్తీకదీపం ఫ్రేమ్ ప్రేమి విశ్వనాథ్ ఇప్పటివరకు ఇలాంటి బయట ఈవెంట్లకు వచ్చిన సందర్భాలు లేవు. కానీ ఈ సారి దసరా సందర్భంగా ఈ వంటలక్క అమ్మోరు పాత్రను జాతరో జాతర కార్యక్రమంలో పోషించడానికి రెడీ అయింది. అయితే ఈ ఈవెంట్ లో బాబా భాస్కర్ కూడా ఎంటర్టైన్ చేయబోతున్నాడు.

 

బిగ్ బాస్ సీజన్ త్రీ లో బాగా పాపులర్టి సంపాదించుకున్న భాస్కర్… ఇటీవల టెలివిజన్ రంగంలో పలు షోలలో రాణించడం మనం చూస్తూనే ఉన్నాం. కాగా ఈసారి బాబా భాస్కర్… యనీ మాస్టర్ తో ట్రాక్ నడపడానికి సిద్ధమైనట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలో విడుదలైన ప్రోమో లో దసరా కి సంబంధించిన ఈ కార్యక్రమంలో యానీ మాస్టర్ తో కలగం పులగం కలుపుతున్న బాబా మాస్టర్ ను … సిగ్గు మానం లాంటివి లేవా అంటూ యాంకర్ రవి వారించడం జరిగింది. దానికి బాబా భాస్కర్ కూడా నాకు అలాంటివి లేవు అని నిర్మొహమాటంగా చెప్పేశారు.