Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ లో… ఉన్న కొద్ది పడిపోతున్న యాంకర్ రవి గ్రాఫ్..!!

Share

Bigg Boss 5 Telugu:  టెలివిజన్ రంగంలో యాంకర్ రవి కి.. ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది అన్న సంగతి తెలిసిందే. పంచ్ డైలాగ్స్ తో పాటు .. తోటి యాంకర్ లతో టెలివిజన్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే గలిగే.. యాంకర్ రవి.. తనదైన శైలిలో జోకులు పేలుస్తూ.. పక్కన ఉన్న వారిని ఏడిపిస్తూ..ఫన్ క్రియేట్ చేయడంలో ఎంటర్టైన్ చేయడంలో.. బుల్లితెరపై సక్సెస్ అయినా గాని బిగ్ బాస్ హౌస్ లో మాత్రం.. అట్టర్ ఫ్లాప్ అవుతున్నాడు.. అనే టాక్ తాజాగా వినబడుతుంది. విషయంలోకి వెళితే బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో… కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన యాంకర్ రవి… హౌస్ లో వ్యవహరిస్తున్న తీరు పై బయట సోషల్ మీడియాలో రకరకాల డిస్కషన్ లో జరుగుతున్నాయి. రెండవ వారం నామినేషన్ లో నటరాజ్ మాస్టర్ గుంటనక్క అంటూ పరోక్షంగా యాంకర్ రవి ని తిట్టడం కరెక్టేనా టాక్ ఇప్పుడు బయట బలం గా వినబడుతోంది. నిజంగా బిగ్ బాస్ హౌస్ కి యాంకర్ రవి పెద్ద గుంట నక్క అని రవి ప్రియ లహరి గొడవ ఎపిసోడ్లో… ప్రియా తో లహరి గురించి రవి మాట్లాడిన వీడియో బయట పడిన తర్వాత.. బయట టాక్ బలంగా వినబడుతుంది.

శనివారం జరిగిన ఎపిసోడ్లో లహరి కి కన్స్ట్రక్షన్ రూమ్ లో.. తన గురించి తప్పుడు గా ప్రియా తో రవి మాట్లాడిన వీడియో ని నాగార్జున చూపించడం.. ఆ సమయంలో అమ్మ మీద ఒట్టు తనకు ఏమీ తెలియదని రవి దారుణంగా.. అడ్డగోలుగా అడ్డంగా అబద్ధాలు ఆడటం వంటివి బయటపడటంతో.. రవి పై భారీ స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. బిగ్ బాస్ హౌస్ కి రవి కరెక్ట్ కాదని.. చాలామంది అంటున్నారు. ఏకంగా ఇంటిలో ఉన్న సభ్యుల దగ్గర ఒకరి దగ్గర మరొకరి మాట మాట్లాడటంతో పాటు… ఎదుటి వ్యక్తిని నెగిటివిటీ చూపించే విధంగా కెమెరాల ముందు రవి వ్యవహరిస్తున్నాడని.. తన తాజా ఆటతీరుపై బయట జనాలు మండిపడుతున్నారు. సొంత తల్లిపై కూడా ఒట్టు అంటూ అబద్ధాలు.. గేమ్ కోసం రవి ఆడటాన్ని.. ఉద్దేశిస్తూ ఇంత నీచంగా దారుణంగా రవి.. 50 లక్షల కోసం.. ఆడతాడా ని తన వ్యక్తిత్వాన్ని తనకి తానే దెబ్బ తీసుకుంటున్నాడని.. ఎవరూ ఊహించలేదు అంటూ ఆయనను అభిమానించే మరికొందరు ఆయన వ్యవహరిస్తున్న తీరుపై.. సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

ఏకంగా నాగార్జున గారి ముందే అబద్ధాలు.. చెప్పడాని కూడా విమర్శిస్తున్నారు. ఏదిఏమైనా ఈ ఆదివారం జరగబోయే ఎపిసోడ్ లో ఇంటి నుండి ఎలిమినేట్ అయ్యే మూడో క్యాండిడేట్.. లహరి అని గట్టి టాక్ వినపడుతోంది. దీనంతటికీ కారణం రవి అని అంటున్నారు. ఏది ఏమైనా రవి పెట్టిన గొడవ.. చివరాకరికి లహరి ఇంటి నుండి బయటకు పంపే రీతిలో.. రిజల్ట్ మారిందని.. రవి ప్రియ లహరి గొడవతో ఇంటిలో రవి గ్రాఫ్ పడిపోతూ మాత్రమే కాక బయట.. కూడా అతని పరువు పోతుందని చాలామంది.. సీజన్ ఫైవ్ లో అతడు ఆడుతున్న ఆటతీరుపై… సీరియస్ కామెంట్లు చేస్తున్నారు. ఇక నాలుగో వారం నుండి కచ్చితంగా బిగ్ బాస్ హౌస్ లో వేరే వాతావరణం నెలకొంటుందని… కచ్చితంగా ఎలిమినేషన్ లో రవి ఉండటం గ్యారెంటీ అని మరికొంతమంది జోస్యం చెబుతున్నారు. యాంకర్ రవి పొరపాటున బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టి.. కెరీర్ పరంగా తన పరువు తానే తీసుకున్న రీతిలో.. అతడు ఆడుతున్న ఆట తీరు ఉందని చాలా మంది భావిస్తున్నారు.


Share

Related posts

Twist In Wedding: కొద్ది సేపటిలో పెళ్లి జరగాల్సి ఉండగా వధువు చేసిన పనికి అందరూ షాక్..! ధర్నాకు దిగిన వరడు..! మేటర్ ఏమిటంటే..?

somaraju sharma

ధర్మాన కృష్ణదాస్ కు బూతులు మాట్లాడేంత కోపం ఎందుకు వచ్చింది ?

Yandamuri

సీతాఫలం గురించి తెలిస్తే మీరు అస్సలు వదలరు!!

Kumar